Bigg Boss Telugu 8 | బుల్లితెర ప్రేక్షకుల ఫేవరేట్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొమ్మిది వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ షో పదో వారంలోకి ఎంటర్ అయ్యింది. ఇక ఈ వారం నామినేషన్స్ కూడా రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ఈ వారం ఏడుగురు నామినేషన్ కంటెస్టెంట్స్ ఉన్నారు. నిఖిల్, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ, హరితేజ, గౌతమ్ నామినేషన్స్‌లో ఉన్నారు.
అయితే ఈ వారం హౌజ్ నుంచి వెళ్లేవారిలో గంగవ్వ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. గత సీజన్లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన గంగవ్వ హౌస్ వాతావరణానికి అలవాటుపడలేకపోయింది. దీంతో మధ్యలోనే హౌజ్ నుంచి బయటకు వచ్చింది. అయితే మళ్లీ ఈ సీజన్లో వెల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక వచ్చి రాగానే ఫిజికల్ టాస్కులో గెలిచి కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది గంగవ్వ. అయితే గంగవ్వ వయసు దృష్ట్యా ఫిజికల్ టాస్కులు ,గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడంపై దూరం పెట్టాడు బిగ్ బాస్. ఇదిలావుంటే హౌజ్‌లో ఉంటున్న గంగవ్వకు మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు తెలుస్తుంది. ఒళ్లు నొప్పులు, కాళ్ల నొప్పులు తనను ఇబ్బంది పెడుతున్నయంటూ గత శనివారం ఎపిసోడ్లో నాగార్జునతో తన బాధ చెప్పుకుంది. ప్రస్తుతం గంగవ్వ పరిస్థితి చూస్తుంటే.. సెల్ఫ్ ఎలిమినేషన్ ద్వారా మళ్లీ హౌస్ నుంచి బయటకు పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
మరోవైపు ఈ వారం నామినేషన్ అయిన వారిలో ఎక్కువ ఓటింగ్‌తో గౌతమ్ మొదటి స్థానంలో ఉండగా.. నిఖిల్ రెండో స్థానంలో ఉన్నాడు. మరోవైపు యాంకర్ విష్ణు ప్రియ, హరితేజ చివరి రెండుస్థానాలతో డేంజర్ జోన్లో ఉన్నారు.