గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 27, 2020 , 18:03:19

బిగ్‌బాస్-4 లో స్వాతి దీక్షిత్

బిగ్‌బాస్-4 లో స్వాతి దీక్షిత్

హైదరాబాద్:  తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు రియాలిటీ షో మజాని పరిచయం చేసిన  'బిగ్ బాస్'  షోకు భారీ స్థాయిలో రెస్పాన్స్‌ వస్తోంది.  ఈ షో ఇప్పటివరకు మూడు సీజన్స్ పూర్తి చేసుకోగా   నాలుగో సీజన్ కొనసాగుతున్నది.  ప్రతీ వారం ఆసక్తికర   టాస్క్ లతో  ప్రేక్షకులను అలరిస్తున్న  బిగ్‌బాస్-4లోకి మరో కంటెస్టెంట్‌ వచ్చేశారు.   వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో హీరోయిన్  హౌస్‌లోకి ప్రవేశించింది.  గ‌తంలో ఎన్నడూ  లేని విధంగా రెండు వారాల్లోనే రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది బిగ్‌బాస్. 

ముచ్చటగా  మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి తెలుగు  హీరోయిన్‌ స్వాతి దీక్షిత్ ను బిగ్ బాస్-4వ సీజన్ లోకి వెల్కమ్ చెప్పింది.  మొదట ఆర్ఎక్స్ 100 సినిమాలో తొలుత స్వాతి హీరోయిన్‌గా ఎంపికైంది.   వారం పాటు  షూటింగ్  చేసిన తర్వాత, ఆ బోల్డ్ రోల్, తన బాడీ లాంగ్వేజ్ కు తగదని భావించి  సినిమా నుంచి తప్పుకుంది.  logo