Bigg Boss: బిగ్ బాస్ హౌజ్ సెకండ్ కెప్టెన్‌గా ఎవరు నిలిచారో తెలుసా?

బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లాక ఎవరు ఎప్పుడు ఎలా మారతారో కూడా ఎవరికి అర్ధం కాదు. ఒక వైపు ప్రేమ, మరోవైపు ద్వేషం ఇంకోవైపు బాధ. వీటన్నింటి మధ్య జీవితం గడుపుతూ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేస్తుంటారు ఇంటి సభ్యులు. సెప్టెంబర్ 16న ప్రసారమైన ఎపిసోడ్లో గద్ద టీమ్, నక్క టీమ్‌లకు బిగ్ బాస్ అగ్గిపుల్ల మజాకా టాస్క్ ఇచ్చారు.
ఈ టాస్క్‌లో పర్పుల్ టీమ్ గెలిచి ఓ జెండా సాధించింది. మొత్తం ఆట పూర్తయ్యే సరికి గద్ద టీమ్ దగ్గర ఎక్కువ జెండాలు ఉండడంతో ఆ టీం గెలిచినట్టు బిగ్ బాస్ తెలిపారు.అయితే ఈ టీంలో నలుగురిని కెప్టెన్సీ పోటీ దారులుగా ఎన్నుకోవాలని గద్ద టీమ్ కెప్టెన్ శ్రీరామ్ చంద్రకు చెప్పారు. ఆయన విశ్వ, యానీ మాస్టర్, పింకీ, హమీదాలను కెప్టెన్సీకి పోటీదారులుగా ప్రకటించాడు.
వీరికి బిగ్‌బాస్.. ‘కొడితే కొట్టాలిరా కొబ్బరికాయ కొట్టాలి’ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో మిగిలిన కంటెస్టెంట్స్ తాము సపోర్ట్ చేస్తున్న వారి బీకర్స్లో కొబ్బరి కాయ కొట్టి ఆ నోళ్లు పోయాలి. ఎవరిది ముందుగా నిండుతుందో వారే విజేతలు. ఈ క్రమంలో విశ్వ విజేతగా నిలిచి రెండో వారం కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ఇక హౌస్‌లో శ్వేత బర్త్‌డే సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా శ్వేత తండ్రి విషెస్ చెప్పిన వీడియోను బిగ్‌బాస్ ప్లే చేయడంతో ఆమె ఎమోషనల్ అయింది. తర్వాత బిగ్‌బాస్ ఇంటిసభ్యుల కోసం చాక్లెట్లు పంపి సర్ప్రైజ్ చేశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

