Bigg boss Non stop | బిగ్ బాస్ ఓటీటీ ప్రోమో విడుదల.. వకీల్ సాబ్‌గా నాగార్జున..
Bigg boss Non stop | తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన రియాలిటీ షో బిగ్ బాస్. ఒకప్పుడు కేవలం హిందీలోనే ఉన్న ఈ షో ఇప్పుడు తెలుగులోనూ బాగా పాపులర్ అయింది. మన దగ్గర ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు ఆరో సీజన్ కూడా మొదలవుతుంది. అయితే ఈసారి మాత్రం టీవీలో కాకుండా ఓటీటీలో దీన్ని మొదలు పెడుతున్నారు. హిందీలో ఇప్పటికే ఒకసారి ఈ ప్రయోగం చేశారు. అయితే అక్కడ బెడిసికొట్టింది. అయినా కూడా తెలుగులో బిగ్‌బాస్ ఓటీటీ మొదలవుతుంది. ఫిబ్రవరి 26 నుంచి మొదలు కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రోమో ఇప్పుడు బయటికి వచ్చింది.
ఇందులో నాగార్జున లాయర్‌గా కనిపించాడు. ప్రోమోను చాలా అద్భుతంగా డిజైన్ చేశారు నిర్వాహకులు. మురళీ శర్మ, వెన్నెల కిశోర్, నాగార్జున ఇందులో కీలక పాత్రల్లో నటించారు. నాగార్జున లాయర్ కాగా.. వెన్నెల కిశోర్ ఉరిశిక్ష పడ్డ ఖైదీ.. అలాగే పోలీస్ ఆఫీసర్‌గా మురళీ శర్మ కనిపించాడు. ఉరిశిక్ష పడ్డ ఖైదీని చివరి కోరిక ఏంటని అడిగితే.. బిగ్ బాస్ షో ఒక ఎపిసోడ్ చూడాలని ఉంది అంటూ కోరతాడు. ఒక గంట కదా అని పర్మిషన్ ఇస్తారు పోలీసులు. అయితే ఉదయం మొదలుపెట్టి రాత్రి వరకు చూస్తూనే ఉంటారు. వెన్నెల కిశోర్‌తో పాటు మిగిలిన వాళ్లు కూడా ఆయన పక్కన కూర్చుని బిగ్‌బాస్ షో ఎంజాయ్ చేస్తారు.
అప్పుడే నాగార్జున వచ్చి ఇక మీద గంట కాదు 24 గంటలు బిగ్‌బాస్ నాన్ స్టాప్ స్ట్రీమింగ్ మీ హాట్ స్టార్ డిస్నీలో వస్తుంది అని చెప్తాడు. బ్రేకులు లేకుండా 24 గంటలు బిగ్ బాస్ రాబోతుంది. ఎన్ని రోజులు ఈ షో ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే గత సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ నే మరోసారి ఇందులోకి తీసుకొస్తున్నారు. టీవీలో వచ్చిన బిగ్‌బాస్ బాగానే సక్సెస్ అయింది. మరి డిజిటల్ మీడియాలో రానున్న 24/7 బిగ్ బాస్ షో ఏమవుతుందో చూడాలి.
https://youtu.be/QzcOrRNHZJE
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

