Nutan Naidu | గ్లోబల్ స్టేజ్‌పై తెలుగు తేజం: ‘హిజ్ ఎక్సలెన్సీ’ బిరుదు అందుకున్న నూతన్ నాయుడు
Nutan Naidu | బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ ఆయనకు ‘సర్’, ‘హిజ్ ఎక్సలెన్సీ’ బిరుదులను ప్రదానం చేసింది.
Nutan Naidu | బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ పీస్ కౌన్సిల్ ఆయనకు ‘సర్’, ‘హిజ్ ఎక్సలెన్సీ’ బిరుదులను ప్రదానం చేసింది. అంతర్జాతీయ వేదికలపై సైంటిఫిక్, సోషల్, ఇంటెలెక్చువల్ సమస్యల పరిష్కారంలో ఐక్యరాజ్యసమితికి అకడమిక్ బ్రెయిన్‌గా సేవలు అందిస్తున్న నూతన్ నాయుడును ఈ పురస్కారం వరించింది. ఈ గౌరవంతో ఆయన గ్లోబల్ ఐకాన్‌గా కొత్త గుర్తింపు సాధించారు.
నూతన్ నాయుడు అకడమిక్ ప్రస్థానం అసాధారణమైనది. ఐవీ లీగ్ విద్యా నేపథ్యంతో పాటు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల పరిశోధన కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారు. దేశంలోని ఐఐఎం కలకత్తా, ఐఐటీ కాన్పూర్, ఎక్స్ఎల్ఆర్ఐ జంషెడ్పూర్, నల్సార్ హైదరాబాద్, సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, గిటామ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల పూర్వ విద్యార్థిగా ఆయన విస్తృత జ్ఞానాన్ని సముపార్జించారు. ఇప్పటికే ఆయనకు మేనేజ్మెంట్ జీనియస్ ఆఫ్ ది మిలీనియం అవార్డు లభించింది.
రాజకీయ రంగంలోనూ నూతన్ నాయుడుది ప్రత్యేక ముద్ర. రాజ్యాంగ నిపుణుడిగా, పొలిటికల్ ఇన్సెప్షన్ బ్రెయిన్‌గా ఆయన సేవలు చెప్పుకోదగినవి. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ ట్రెండ్ సెట్ చేసిన ప్రజారాజ్యం, వైఎస్సార్సీపీ, జనసేన, జై సమైక్యాంధ్ర, భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావానికి ముందు జరిగిన బ్రెయిన్స్టోర్మింగ్ సెషన్స్‌లో ఆయన కీలక సూత్రధారిగా వ్యవహరించారు. ఏ పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, ప్రజాస్వామ్యంపై నమ్మకంతో నిస్వార్థంగా పనిచేశారని సన్నిహితులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎన్నికల వ్యూహ రచనలో ఆయనకు తిరుగులేదు. ఆయన వ్యూహాలు అందుకున్న అభ్యర్థులు విజయం సాధించడం, ఆయన టచ్ చేసిన ఎన్నికలు గెలుపు బాట పట్టడం పరిపాటిగా మారింది.
ప్రస్తుతం 17 అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా, లండన్, యూరప్ విద్యా సంస్థలకు గవర్నర్‌గా సేవలందిస్తున్నారు. యూకే, యూఎస్ఏ, మెక్సికో, మిడిల్ ఈస్ట్ దేశాల్లో విస్తరించిన ఎన్ఎన్ఎన్ఎన్ సంస్థలకు అధినేతగా కొనసాగుతున్నారు. ఈ సత్కార కార్యక్రమంలో తన తండ్రి సన్యాసి రావు నాయుడు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచ శాంతి కోసం మరింతగా కృషి చేస్తానని నూతన్ నాయుడు ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

