Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9 షో ఆరు వారాల మార్క్ దాటింది. ఐదో వారంలో ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో షోలో రచ్చ మొదలైంది. దివ్వెల మాధురి, రమ్య మోక్ష వంటి కొత్త కంటెస్టెంట్లు పాత హౌజ్‌మేట్స్ రిలేషన్లపై ఫోకస్ పెట్టి చర్చలకు దారి తీశారు. ఈ నేపథ్యంలో శనివారం ఎపిసోడ్లో నాగార్జున హౌజ్‌లోని పరిస్థితులను, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌కి ఇచ్చిన పవర్స్‌పై సమీక్ష జరిపారు.హౌజ్‌మేట్స్, ఆడియెన్స్ అభిప్రాయాల ఆధారంగా నాగ్ తీర్పు వెలువరించారు. దివ్వెల మాధురి తన పవర్‌కు అర్హురాలు కాదని తేల్చగా, రమ్య మోక్ష, శ్రీనివాస సాయి, ఆయేషాలకు మాత్రం పవర్స్ కొనసాగించారు. నిఖిల్ నాయర్, గౌరవ్‌ల పవర్స్ రద్దు చేశారు.
అదే ఎపిసోడ్లో దివ్వెల మాధురి, కళ్యాణ్‌ల మధ్య జరిగిన గొడవపై నాగ్ స్పందించారు. “నువ్వు చెప్పిన విషయం తప్పు కాదు కానీ చెప్పిన విధానం తప్పు” అంటూ మాధురికి సలహా ఇచ్చారు. అలాగే రమ్య మోక్ష కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలోనూ నాగ్ హెచ్చరించారు. రమ్య, కళ్యాణ్, తనూజల మధ్య తలెత్తిన పుకార్లపై కూడా చర్చ సాగింది. తనూజను కన్ఫెషన్ రూమ్‌కి పిలిపించిన నాగార్జున, రమ్య మోక్ష హౌజ్‌లో ఇతరులతో చేసిన సంభాషణల వీడియోలను చూపించి ఆమె గాసిప్ వ్యవహారాన్ని బహిర్గతం చేశారు. దీనికి తనూజ షాక్‌కు గురై, ఇకపై క్లారిటీతోనే వ్యవహరిస్తానని హామీ ఇచ్చింది.
రమ్య మోక్ష తన ప్రవర్తనతో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. బయటకు క్యూట్‌గా కనిపిస్తున్న రమ్య హౌజ్‌లో గాసిప్స్ నడపడం, ఇతరుల రిలేషన్లపై వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారి తీసింది. దీంతో ఆమెపై ఆడియెన్స్ అభిప్రాయం మారిందని చెప్పొచ్చు. శనివారం ఎపిసోడ్లో నాగార్జున దివ్వెల మాధురిని కొత్త రేషన్ మేనేజర్‌గా నియమించగా, ఇమ్మాన్యుయెల్‌తో సరదా సంభాషణ సాగించారు. అలాగే రమ్య, ఆయేషాల అందం గురించి మాట్లాడుతూ ఇద్దరూ చాలా క్యూట్‌గా ఉన్నారని చెప్పారు. మొత్తానికి ఈ వారం ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌజ్‌లో కలకలం రేపగా, రమ్య మోక్ష ప్రవర్తన బిగ్ బాస్ హౌజ్‌లో చర్చనీయాంశంగా మారింది.