Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో గేమ్ కన్నా డ్రామానే ఎక్కువగా సాగుతోంది. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఎలిమినేషన్స్, రీ–ఎంట్రీలతో ప్రేక్షకులు గందరగోళానికి గురవుతున్నారు. ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నారో, ఎందుకు తిరిగి తీసుకొస్తున్నారో అర్ధం కావడం లేదంటూ షోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కామన్ కంటెస్టెంట్లను తీసుకోవడంతో షో స్థాయి పడిపోయిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో భారీ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆరవ వారం షాకింగ్ ఎలిమినేషన్‌తో హౌస్ నుంచి బయటకు వెళ్లిన భరణి , ఇప్పుడు గోడకి కొట్టిన బంతిలా మళ్లీ హౌస్‌లోకి రీ–ఎంట్రీ ఇచ్చాడు.
ప్రోమోలో భరణి, హౌస్‌లో అడుగుపెట్టగానే వాతావరణం పూర్తిగా మారిపోయింది. భరణిని చూసి దివ్య నిఖిత పరుగు పరుగున వెళ్లి కౌగిలించుకుంది. ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అయితే తనూజ మాత్రం సైలెంట్‌గా ఉంది. హౌస్‌లో అడుగుపెట్టగానే భరణి తన స్టైల్లోనే పంచ్‌లు వేయడం మొదలుపెట్టాడు. ఇమ్మానుయేల్‌కి పంచ్ వేస్తూ..“కట్టప్పా.. చంపేశావ్ కదా అమరేంద్ర బాహుబలిని, ఇప్పుడు మహేంద్ర బాహుబలి వచ్చాడు కట్టప్పా!” అంటూ సరదా పంచ్ వేశాడు. సంజనపై గట్టిగానే విరుచుకుపడ్డాడు. “మీరు నన్ను లయన్ అన్నా, భరణి అన్నా అని పిలిచినప్పుడు నేను సిస్టర్లా భావించాను. నేను ఎవరి దగ్గరా ఫేక్ రిలేషన్స్ మెయింటైన్ చేయలేదు. మీరు సారీ అంటారు, కానీ సారీ చెప్పడంతో సరిపోతుందా?” అంటూ భరణి గట్టిగా ప్రశ్నించడంతో సంజన స్టన్ అయిపోయింది.
ఇక మరోవైపు శ్రేష్టి వర్మ కూడా తన దారిలోనే సాగింది. డెమాన్ పవన్‌ను ఉద్దేశిస్తూ .. “నీకు కండబలం ఉంది కానీ బుద్ధి బలం లేదు. నీతో ఉన్న రీతూకి క్లారిటీ ఉంది, కానీ నీకు అస్సలు లేదు” అంటూ గట్టిగా విరుచుకుపడింది. నిఖిల్ – తనూజ ఘర్షణ కూడా నామినేషన్స్‌లో హైలైట్ అయింది. కెప్టెన్సీ టాస్క్ సమయంలో తనూజ ప్రవర్తన నచ్చలేదని నిఖిల్ స్పష్టంగా తెలిపాడు. “మీరు ఏం గేమ్ ఆడారో నాకు కనిపించలేదు” అన్న తనూజకు, “మీరు చూడకపోతే నా తప్పు కాదు కదా” అంటూ నిఖిల్ పంచ్ ఇచ్చాడు. చివరగా “మీ ఫోటో కెప్టెన్సీ బోర్డ్‌లో ఎక్కడ ఉంది?” అంటూ చురక వేశాడు. ఈ ఎపిసోడ్‌తో బిగ్ బాస్ హౌస్ మళ్లీ స్పైసీ టర్న్ తీసుకుంది. ఎలిమినేషన్స్, రీ–ఎంట్రీలు, ఘర్షణలతో షో రసవత్తరంగా మారింది. అయితే ప్రేక్షకుల అభిప్రాయం మాత్రం ఒక్కటే .. “ఈ సీజన్ గందరగోళంగా సాగుతోంది, కానీ డ్రామా మాత్రం ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది అని అంటున్నారు.