Bigg Boss 9 |బిగ్‌బాస్ 9 తాజా ఎపిసోడ్లో దోస్తీకీ, ద్రోహానికీ మధ్య లైన్ పూర్తిగా బ్లర్ అయిపోయింది. శాశ్వత శత్రువులు-శాశ్వత మిత్రులు అన్నది ఈ షోలో ఉండదన్న మాటను మరోసారి రుజువు చేస్తూ, గేమ్‌లో ముందుకు వెళ్లాలంటే ఎవర్నైనా త్యాగం చేయాల్సిందేనని తేలిపోయింది. తాజాగా జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో తనూజ తీసుకున్న డెసిషన్ హౌస్‌మేట్స్‌ను షాక్‌కు గురిచేసింది. టాప్ 2లో ఉన్న తనూజ, కళ్యాణ్‌లలో ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ బిగ్‌బాస్ ఇచ్చినప్పుడు.. తనూజ ఒక్క మాట అడగగానే కళ్యాణ్‌ను సేఫ్ చేసి, తానే డేంజర్ జోన్లోకి వెళ్లింది. దీని వెనక కథేంటో తాజాగా బయటపడింది. తనూజ అమాయకత్వాన్ని వాడుకున్న కళ్యాణ్, ముందే మాట్లాడుకున్నట్టు తాను సేఫ్ అవుతానని మాట తీసుకున్నాడని తనూజ చెప్పింది. అయితే దీన్ని దివ్య, ఇమ్మూ, భరణి జీర్ణించుకోలేకపోయారు. “ఇది సరైన నిర్ణయం కాదు.. ముందు మాట ఇచ్చినట్టు నువ్వు గేమ్ ప్లే చేయకూడదు” అంటూ మండిపడ్డారు.
డేంజర్ జోన్ నుంచి బయట పడే “ఫైట్ ఫర్ సర్వైవల్” టాస్క్‌లో తనూజకి భరణి పూర్తి సపోర్ట్ చేశాడు. చివరకు తనూజ గెలిచి డేంజర్ జోన్ నుంచి సేఫ్ అయింది. గెలిచిన తర్వాత తనూజను భుజాలపై మోసుకెళ్లి మరీ ఆనందం వ్యక్తం చేశాడు భరణి. దివ్య కూడా కొంత సపోర్ట్ చేసింది. “కనుక్కోండి చూద్దాం” అనే టాస్క్‌లో తనూజ తన ‘చెల్లి’గా భావిస్తున్న దివ్య లైట్ ఆఫ్ చేసి, ఆమెను ఆట నుంచి తొలగించడంతో దివ్య షాక్ అయ్యింది. నమ్మిన వాళ్ల నుంచే మోసం ఎదురవడం చాలా బాధగా ఉందని దివ్య కామెంట్ చేసింది. ఈ వ్యవహారం తనూజ మీద నమ్మకాన్ని తగ్గించింది.
తనూజ ఫైనల్స్‌కి వచ్చినా.. కెప్టెన్సీ రేసులో కళ్యాణ్‌ను సెలెక్ట్ చేశారు డేంజర్ జోన్లో ఉన్న హౌస్మేట్లు. అంతేగాక, తన ‘విలన్’గా భావించిన దివ్య చేతుల మీదుగానే బ్యాండ్ కట్టించుకోవడం కళ్యాణ్ ప్లాన్‌లో భాగం అని శ్రీజ వెల్లడించింది. ఈ గేమ్ తర్వాత దివ్య, భరణి, ఇమ్మూ అందరూ తనూజ గేమ్ ప్లే పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనూజ ప్రస్తుతంగా కళ్యాణ్ వైపు పూర్తిగా మొగ్గు చూపుతోంది. అయితే ఇది ఆమెకు బెనిఫిట్ అవుతుందా? లేక రివర్స్ అవుతుందా? అనేది మిగిలిన రోజుల్లో తేలనుంది. బిగ్‌బాస్ హౌస్‌లో నమ్మకం తాత్కాలికం.. గేమ్ పర్మనెంట్! తనూజ నిర్ణయాలు పట్ల ప్రస్తుతం ఉన్న రియాక్షన్లు, భావోద్వేగాలు గేమ్ నడుస్తున్నంతకాలం గుర్తుండేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ వారం కళ్యాణ్ కెప్టెన్
కావడంతో బిగ్‌బాస్ అభినందనలు తెలిపాడు. అయితే రాము తన చేతికి ఉన్న బ్యాండుని తీసుకొచ్చి కళ్యాణ్‌కి కట్టడానికి వస్తే వద్దు.. దివ్య చేతుల మీదుగా కట్టించుకుంటానని చెప్పాడు. అందుకు కారణం ఆమె కళ్యాణ్‌ని వరస్ట్ ప్లేయర్ అని అన్నది కాబట్టి ఇప్పుడు ఆమె చేతే కెప్టెన్ బ్యాండ్ కట్టించుకున్నాడు.