Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ప్రతి ఎపిసోడ్ కొత్త కొత్త మలుపులతో, భావోద్వేగాలతో నిండిపోతోంది. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిన తరుణంలో తాజాగా విడుదలైన ప్రోమో మరింత ఆసక్తి రేపుతోంది. ప్రోమోలో హోస్ట్ నాగార్జున, కంటెస్టెంట్లు రీతూ, ఫ్లోరా మధ్య ఎలిమినేషన్ రౌండ్ నిర్వహించినట్లు చూపించారు. ఈ ఇద్దరిలో ఒక్కరిని ఈ వారం హౌస్ నుండి బయటకు పంపించనున్నట్లు నాగార్జున పేర్కొనడంతో వారిద్దరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నాగార్జున .. “ఈ ఇంట్లో మీరు ఎవరిని ఎక్కువగా మిస్ అవుతారు?” అని ప్రశ్నించగా, మొదట ఫ్లోరా స్పందిస్తూ, “నేను సంజనను బాగా మిస్ అవుతాను…” అంటూ కంటతడి పెట్టింది.
తర్వాత రీతూ మాట్లాడుతూ, “పవన్ను వదిలి వెళ్లలేను. ఐ మిస్ యూ పవన్” అంటూ గుక్కపట్టి ఏడ్చింది. ఆమె భావోద్వేగంతో మాట్లాడిన క్షణం హౌస్లో అందరు ఎమోషనల్ అయ్యారు. ఇక పవన్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఇక రీతూ ఏడుస్తున్న దృశ్యం చూసిన డెమోన్ పవన్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమె మాటలు వింటూ అతడు ఏడవడం ప్రోమోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.ఈ వారం ఎలిమినేట్ అయ్యేది రీతూనా లేదా ఫ్లోరానా అన్నది ఆదివారం ఎపిసోడ్లో స్పష్టంకానుంది. బిగ్ బాస్ సీజన్ 9 రోజురోజుకూ మరింత ఉత్కంఠగా మారుతుండటంతో, తదుపరి ఎపిసోడ్స్ పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి తారాస్థాయికి చేరుతుంది.
బిగ్ బాస్ సీజన్ 9 నుంచి కామనర్స్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ ఆరుగురు కామనర్స్ లో మనీష్, హరీష్, ప్రియా బయటకు వచ్చేశారు. కళ్యాణ్, డీమాన్ పవన్, శ్రీజ మాత్రమే హౌస్ లో ఉన్నారు. శ్రీజ కూడా ఈ రోజు హౌజ్ నుండి బయటకు వచ్చేస్తుంది అనే టాక్ నడుస్తుంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కొందరు అంటున్నారు. ఒకవేళ శ్రీజ బయటకు వస్తే డీమాన్ పవన్, కళ్యాణ్ మాత్రమే కామనర్స్ గా హౌస్ లో ఉన్నారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఆరుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్ లోకి రానున్నారు. సాయంత్రం 7గం.లకి షో ప్రారంభం కానుంది.