Bigg Boss 9 | బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం రోజే కంటెస్టెంట్లకు భారీ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఉదయం లేవగానే డాన్స్ గ్రూప్ హౌస్‌లోకి వచ్చి ఎంటర్టైన్ చేయడంతో కంటెస్టెంట్లు ఎనర్జీతో మురిసిపోయారు. ఆ తరువాత “ఇన్ హౌస్ – అవుట్ హౌస్” టాస్క్ ద్వారా ఓనర్స్ – టెనెంట్స్‌గా విభజించి, ఒకరిని ఒకరు ఇంప్రెస్ చేసే ఫన్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. టాస్క్‌ల మధ్యలో బిగ్ బాస్ సెలబ్రిటీలకు షాకింగ్ వార్నింగ్ ఇచ్చాడు. “సెలబ్రిటీలు హౌస్‌లో ఎందుకు వచ్చారు?” అన్న ప్రశ్న కాసేపు హౌస్ మొత్తాన్ని షాక్‌లో ముంచింది. అయితే వెంటనే “హౌస్‌లోకి స్వాగతం” అని చెప్పి కంటెస్టెంట్లను రిలాక్స్ అయ్యేలా చేశాడు.
తర్వాత స్పెషల్ స్పీచ్ ఇస్తూ ..“ఇకనుంచి ఆట మొదలైంది. మీ ప్రయాణంలో స్నేహాలు, విభేదాలు వస్తాయి. ప్రతి క్షణం మధుర జ్ఞాపకమవుతుంది. ఆల్ ది బెస్ట్” అంటూ కంటెస్టెంట్లలో జోష్ నింపాడు. ఓనర్స్–టెనెంట్స్ టాస్క్‌లో ఆర్మీ మ్యాన్ కళ్యాణ్, ఆశా, హరీష్, ఇమ్మాన్యుయేల్, శ్రష్టి వర్మ, రీతు, రాము రాథోడ్, భరణి, తనుజ, శ్రీజ, ప్రియా లకు వేర్వేరు పనులు అప్పగించబడ్డాయి. ముఖ్యంగా కుకింగ్ బాధ్యతలు భరణికి రావడంతో, “కిచెన్‌లో పనిచేసేవారు క్లీనింగ్ కూడా చేయాలి” అన్న శ్రీజ స్టేట్మెంట్ హౌస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. క్లీనింగ్ టాస్క్‌లో మాస్క్ మాన్ హౌస్‌మేట్స్‌కి డైరెక్ట్ ఆదేశాలు ఇవ్వగా, మర్యాద మనీష్ “బిగ్ బాస్ రూల్స్‌ను అతిక్రమించకూడదు” అంటూ ఎదిరించాడు. దీంతో మాస్క్ మాన్ రెచ్చిపోయి “మీకు బ్యాడ్జ్ రాలేదు, మీరు మాట్లాడకండి” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు.
భోజనం చేస్తుండగా బిగ్ బాస్ ఓనర్స్–టెనెంట్స్ మధ్య టెన్షన్ పెంచాడు. “టెనెంట్స్ ఇళ్లు ఓనర్స్‌కే, మీరు బయటకు వెళ్లండి” అని ఆదేశించడంతో ఇమ్మాన్యుయేల్, హరీష్, తనుజ, సంజనా కన్ఫ్యూజ్ అయ్యారు. చివరికి కామనర్స్ సపోర్ట్‌తో ఇమ్మాన్యుయేల్ తినడం కొనసాగించాడు. అయితే టెనెంట్స్‌ను హౌస్ బయట నిలబెట్టి, ఓనర్స్ అనుమతి లేకుండా లోపలికి రావద్దన్న కొత్త రూల్ పెట్టాడు. ఫుడ్ విషయంలో మాస్క్ మాన్ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. “వాళ్లు నా బంధువులు కాదు, కానీ ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు” అని చెప్పి హౌస్‌లో మరోసారి హైలైట్ అయ్యాడు. “నేను ఓ డెసిషన్ తీసుకుంటే దేవుడు వచ్చినా ఆగను” అంటూ తన అటిట్యూడ్ చూపించాడు.
కంటెస్టెంట్లు అందరూ తమ అసలైన స్వభావాన్ని బయటపెట్టకుండా నటిస్తున్నారని ప్రియా కామెంట్ చేసింది. ఇమ్మాన్యుయేల్, శ్రష్టి తప్ప మిగతావారంతా ఫేక్ అని చెప్పడంతో హౌస్‌లో చర్చ మొదలైంది. రోజు చివర్లో ఇమ్మాన్యుయేల్ హరీష్‌ను “గుండు” అంటూ సరదాగా కామెంట్ చేయడంతో హౌస్‌లో మరో ఘర్షణ చెలరేగింది. క్షమాపణ చెప్పినా మాస్క్ మాన్ దాన్ని సీరియస్‌గా తీసుకుని హెచ్చరించాడు. “హ్యూమర్‌కి కూడా లిమిట్ ఉండాలి” అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో హౌస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.