Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9 మంగళవారం ఎపిసోడ్ పూర్తిగా టికెట్ టూ ఫినాలే టాస్క్‌లతో సందడిగా సాగింది. ఫినాలేకు ఒక అడుగు దూరంలో ఉన్న ఈ దశలో హౌస్మేట్స్ ప్రతి ఒక్కరూ తమ స్ట్రాటజీలను తెరపైకి తీసుకువస్తూ ఆటను మరింత వేగవంతం చేశారు. టాస్క్‌లలో గెలిచిన కంటెస్టెంట్‌కు డైరెక్ట్ ఫైనల్ ఛాన్స్ లభించనుండడంతో ప్రతి రౌండ్ కఠినంగా మారింది. మొదటి రౌండ్లో హౌజ్ నిర్ణయం మేరకు రీతూ చౌదరీ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్‌కు ‘కనుక్కోండి చూద్దాం’ అనే లెక్కల టాస్క్ ఇవ్వబడింది. ప్లస్, మైనస్ కార్డులుతో ఉన్న బోర్డులో బిగ్ బాస్ చెప్పిన నంబర్లను గుర్తించడం ఈ టాస్క్ లక్ష్యం. వీరిలో వేగంగా లెక్కలు పేర్చిన ఇమ్మాన్యుయేల్ ఈ రౌండ్లో విజయం సాధించాడు. అయితే రీతూ కనీస లెక్కలు కూడా చెప్పలేక జీరో స్కోర్‌తో ఓడిపోవడం హౌజ్‌లో నవ్వులు పూయించింది. ఆమె సమాధానాలు వింతగా ఉండటంతో బిగ్ బాస్ కూడా షాక్ అయ్యాడు.
విజయం సాధించిన ఇమ్మాన్యుయేల్ తదుపరి రౌండ్లో సంజనాను ఛాలెంజ్ చేశాడు. ఆమెకి ఇష్టం లేకపోయినా చివరకు అతని మాటకి సర్ధుకుపోయి టాస్క్‌లో పాల్గొంది. బాల్ ఆధారంగా జరిగిన ఈ గేమ్‌లో సంజనా పోరాడినా, చివరకు ఓటమి చవిచూసింది. రెండు రౌండ్లు వరుసగా గెలిచిన ఇమ్మాన్యుయేల్ తన బాక్స్‌లను విస్తరించుకుంటూ ఫినాలే రేసులో ముందంజలో నిలిచాడు. ఓటమి పట్ల సంజనా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడం హౌజ్‌లో భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించింది. మూడో రౌండ్లో భరణి, తనూజ, డీమాన్ పవన్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ల్యాండ్‌లో ఎక్కువగా ఫ్లవర్స్ నాటాల్సిన ఈ టాస్క్ తీవ్ర ఉత్కంఠను రేకెత్తించింది. డీమాన్ పవన్ ఎంత ప్రయత్నించినా తనూజను ఓడించలేకపోయాడు. ఆమె అద్భుతమైన వేగంతో 59 పుష్పాలు నాటి స్పష్టమైన లీడ్‌తో విజయం సాధించింది. తదుపరి రౌండ్లో ఆమె సుమన్ శెట్టిని ఢీ కొట్టనుంది.
ఫినాలే దశకు దగ్గరవుతున్న కొద్దీ కంటెస్టెంట్లు తమ స్ట్రాటజీలను బహిర్గతం చేస్తున్నారు. తనూజ నామినేషన్లో అరవడం పట్ల ఇమ్మాన్యుయేల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మరోవైపు టికెట్ టూ ఫినాలే రేస్‌లో సుమన్ శెట్టి, భరణి కలిసి ప్లాన్స్ వేసుకుని, బలమైన ప్లేయర్లైన ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, డీమాన్‌లతో టాస్క్‌లకు వెళ్లొద్దని మాట్లాడుకున్నారు. ఇదే సమయంలో ఇమ్మాన్యుయేల్, పవన్, రీతూ కలిసి సుమన్ శెట్టి సైలెంట్ గేమ్ గురించి చర్చించుకోవడం హైలైట్‌గా నిలిచింది. అన్ని వైపుల నుంచి స్ట్రాటజీలు, భావోద్వేగాలు, దాడులు, సమాధానాలతో బిగ్ బాస్ హౌస్ మంగళవారం టాస్క్ మరింత ఆసక్తికరంగా మారింది. ఫినాలేకు దరికి చేరిన ఈ సమయంలో కంటెస్టెంట్ల అసలు నైజాలు, గేమ్ ప్లాన్లు స్పష్టమవుతున్నాయి. టికెట్ టూ ఫినాలే రేస్‌లో ఎవరు నిలుస్తారో చూడాలి.