Bigg boss 5 telugu | బిగ్ బాస్ 5 తెలుగు పదో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈవారం ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్తారు అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చలు బాగానే జరుగుతున్నాయి. ఇప్పటికే 62 రోజులు పూర్తయింది మరో 45 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అంటే మరో ఆరు వారాల అన్నమాట. ప్రస్తుతం ఇంట్లో 11 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఆరు వారాల్లో మరో ఆరుగురిని బయటికి పంపించాలి. అయితే బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడు ఎలాంటి విచిత్రాలు జరుగుతాయో ఎవరూ ఊహించలేరు. ఈసారి కూడా అలాగే జరగబోతుంది. ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేయబోతున్నారు అని ప్రచారం జరుగుతుంది. నిజానికి గత కొన్ని వారాల నుంచి డబల్ ఎలిమినేషన్‌పై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. కానీ ఇప్పటివరకు జరగలేదు. ఒక వారం లోబోను అలా బయటకు పంపించిన కూడా సీక్రెట్ రూమ్‌లో పెట్టి నాలుగు రోజుల తర్వాత మళ్లీ ఇంట్లోకి పంపించారు. కానీ ఈసారి అలా కాకుండా సీరియస్‌గానే ఎలిమినేషన్ ఉండబోతోందని తెలుస్తోంది.
ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లడానికి ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. శ్రీరామచంద్ర, సన్నీ, కాజల్, యాంకర్ రవి, సిరి, జెస్సీ, ప్రియాంక, విశ్వ ఈసారి నామినేషన్స్‌లో ఉన్నారు. వీళ్లలో శ్రీ రామ్, యాంకర్ రవి, సిరి, సన్నీ సేఫ్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. జెస్సీకి కూడా సింపతి ఓట్లు బాగానే పడినట్లు ప్రచారం జరుగుతుంది. విశ్వ, కాజల్, ప్రియాంక ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్న కూడా చివరి నిమిషంలో కాజల్ బయటపడిందని.. ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ ఎవరో కాదు ప్రియాంక సింగ్ అండ్ విశ్వ. నామినేషన్స్ అంటేనే భయపడిపోయే ప్రియాంక ఈ వారం ఇంటిముఖం పట్టనుందని తెలుస్తోంది. అందరి కంటే తక్కువ ఓట్లు ఈమెకే వచ్చాయని.. సొంత ఆట ఆడటం మానేసి మానస్ పై మనసు పెట్టినందుకు ప్రియాంకకు ప్రేక్షకులు ఇచ్చిన బహుమతి ఇదే అనిపిస్తుంది. మరోవైపు విశ్వ కూడా ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నాడని తెలుస్తోంది. శని ఆదివారాల్లో ఇద్దరిని నాగార్జున ఎలిమినేట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అది అబద్ధమైతే కచ్చితంగా ఈ వారం ప్రియాంక ఇంటి ముఖం పట్టనుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bigg Boss 5 telugu : ఈ వారం కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?
Shanmukh : ఇన్నర్స్ గురించి మరోసారి షణ్ముఖ్-సిరి మధ్య డిస్కషన్
Priyanka :నీకు హాని చేస్తే నాశనం కావాలని కోరుకుంటావు.. పింకీకి చురక అంటించిన మానస్
Jaswanth : బుగ్గలు ఖాళీగా ఉన్నాయి, ముద్దులు కావాలని అడుగుతున్న జెస్సీ
Bigg Boss 5 telugu : పేడ నీళ్లు మీద పోసుకున్న అనీ మాస్టర్.. టీం కోసం చాలా త్యాగాలే చేసింది!