కెప్టెన్ కంటెండర్ టాస్క్ పూర్తైన తర్వాత సిరి,షణ్ముఖ్, కాజల్ బయట కూర్చోగా, అసలు మీరు సూపర్ హీరోస్నా విలన్స్నా.. పిచ్చోళ్లు మాదిరిగా ఇన్నర్స్ ఎగరేస్తారా? అని సిరిని ఉద్దేశించి కాజల్ ముందు అన్నాడు షణ్ముఖ్. అందులో ఇన్నర్స్ ఉన్నాయని నాకు ఏం తెలుసు అని సిరి ఉంది. హౌజ్ నీట్‌గా లేకపోతే నాగార్జున గారు నన్ను క్లాస్ పీకుతారు. తీసి లోపల పెట్టమంటే నువ్వు పెట్టలేదు. అందుకు నాకు కోపం వచ్చిందని షణ్ముఖ్ అన్నాడు.
ఇక ప్రియాంక- మానస్ మధ్య ఏం జరుగుతుందో ఎవరికి అర్ధం కావడం లేదు. మానస్ కూర్చుని తింటుండగా.. అతని దగ్గరకు వచ్చి వయ్యారాలు ఒలకబోసే ప్రయత్నం చేసింది ప్రియాంక. అయితే మానస్(Manas) ‘నువ్వే నా సిస్టర్’ అనే సరికి పింకీ కంగుతింది. పక్కనే ఉన్న కాజల్(kajal)ను చూపిస్తూ ‘ఆమె నీ సోదరి అయి ఉంటుంది. నేను మాత్రం కాదు’ అని చెప్పింది. ‘సిస్టర్’ అని మానస్ పదే పదే ఏడిపించటంతో ‘రాజా రాణి’ స్టైల్లో బ్రదర్ అని ఆటపట్టిద్దామనుకున్నా పరువు పోయింది’ అని ప్రియాంక సిగ్గుపడింది.
ప్రియాంక-మానస్ లవ్‌కి సంబంధించి సిరి కూడా మాట్లాడింది. మీ మ్యాటర్ ఎంత వరకూ వచ్చింది.. నాకు నిన్ననే తెలిసింది.. మీ ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారంట కదా.. అంటూ లవ్ సింబల్ చూపించింది. సైగ చేయకే అర్థం అయిపోతుంది అని ప్రియాంక తెగ సిగ్గుపడిపోగా.. అతనికి కూడా ఇష్టమేనంట కదా అని సిరి అన్నది. దీంతో ప్రియాంక.. నేనంటే ఇష్టం అని తెలుసు.. కానీ ఓపెన్ కాడు.. నేనేంటో అతనికి తెలుసు అంటూ ఏడ్చేసింది ప్రియాంక.