Bigg boss 5 telugu | ఈ సీజన్లో ఫస్ట్ లవ్ స్టోరీ ఎవరిదో తెలుసా..?

Bigg boss 5 telugu | బిగ్ బాస్ ఇంట్లో ఉండాలంటే కచ్చితంగా కాంట్రవర్సీలు చేయాలి లేదంటే కాదల్ చేయాలి. అదేనండీ ప్రేమలో పడాలి. అక్కడ ఈ రెండూ చేయకుండా ముందుకు రావడం కష్టమే. మరీ ముఖ్యంగా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాను.. రాముడు మంచి బాలుడు అంటే ప్యాక్ చేసి ఇంటికి పార్సల్ చేస్తారు ఆడియన్స్. అక్కడున్న కంటెస్టెంట్స్ కూడా తక్కువోళ్లేం ఉండరు. అందరూ అందరే.. ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని కాచుకుని కూర్చుంటారు. తాజాగా మొదలైన బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ అయితే మరీ ఆసక్తికరంగా మారిపోయింది. తొలివారంలోనే కావాల్సినంత కంటెంట్ జనరేట్ చేస్తున్నారు కంటెస్టెంట్స్. కొందరు అయితే మరీ ముఖ్యంగా కంటెంట్ పుట్టించడానికే ఇంట్లోకి అడుగు పెట్టినట్లు అర్థమవుతుంది. మాట్లాడితే గొడవలు పడటం అనేది వాళ్లకు కామన్ అయిపోయింది. చివరికి కామ్‌గా ఉండే యానీ మాస్టర్ కూడా మోడల్ జెస్సీపై సీరియస్ అయిపోయింది.
మిగిలిన వాళ్లలో ఆర్జే కాజల్ అన్నం తిన్నావా అని అడగటానికి కూడా హైపర్ యాక్టివ్ చూపిస్తుంది. ఇలా కొందరు కంటెస్టెంట్స్ ముందుకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే ఓ లవ్ స్టోరీకి కూడా ఈ సీజన్లో మూడు రోజుల్లోనే బీజం పడిపోయింది. అది మొక్కై మాను అవుతుందో లేదంటే ఇక్కడే విరిగిపోతుందో అనేది కాలమే నిర్ణయించనుంది. ప్రస్తుతం ఇంట్లో చాలా మంది కంటెస్టెంట్స్‌కు పెళ్లి అయిపోయింది. శ్రీరామచంద్ర, మానస్, షణ్ముఖ్, జస్వంత్ లాంటి కొందరు మాత్రమే సింగిల్స్ ఉన్నారు. వాళ్ల గురించి ఓపెన్‌గానే అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కంటెస్టెంట్ గురించి మనసులో మాట బయటపెట్టి.. అతడిపై క్రష్ ఉందని కూడా ఓ అమ్మాయి చెప్పేసింది. ఆమెవరో కాదు జబర్దస్త్ నుంచి వచ్చి ఆపరేషన్ తర్వాత అమ్మాయిగా మారిన ప్రియాంక సింగ్ ( jabardasth priyanka singh ).
ప్రియాంకకు బయట సింపతీ బాగానే ఉంది. షో లోపలికి వెళ్లిన తర్వాత తన కష్టాల గురించి అందరికీ చెప్తూనే ఉంది ప్రియాంక. ఈ నేపథ్యంలోనే అందర్నీ అన్నయ్య అని పిలుస్తుంది. అయితే మానస్ విషయంలో మాత్రం అలా పిలవడం లేదు ప్రియాంక. తనను అన్నయ్య, తమ్ముడు అని పిలవలేను అంటూ చెప్పుకొచ్చింది. ఇంట్లో ఉన్న అబ్బాయిలందర్నీ కూడా అన్నయ్య అనమంటే అంటాను కానీ మానస్‌ను మాత్రం అలా పిలవలేనంటుంది ప్రియాంక. అతడిపై క్రష్ ఉందని ఓపెన్‌గానే ఒప్పేసుకుంది ఈమె. మరి రాబోయే రోజుల్లో ఈ క్రష్ కథ ఎలా ఉండబోతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bigg boss: బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి రెమ్యునరేషన్ ఎంత ఇస్తారో తెలుసా?
Bigg Boss: మొహం పగిలిపోద్ది అంటూ లోబోకి వార్నింగ్ ఇచ్చిన సిరి
Biggboss Season 5 telugu| ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ లక్ష్యం ఒక్కటే
Bigg boss: బిగ్ బాస్ ఆలోచన ఎవరిది, ఎలా మొదలైంది..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

