Bigg Boss: మొహం పగిలిపోద్ది అంటూ లోబోకి వార్నింగ్ ఇచ్చిన సిరి

బిగ్ బాస్ హౌజ్‌లో మంట మొదలైంది. 19 మందిని తెచ్చి నాలుగు అద్దాల గదిలో ఉంచే సరికి వారికి పిచ్చెక్కిపోయి ఆవేశంతో ఊగిపోతున్నారు. ఒక్కరోజుకే అందరికి బీపీలు పెరిగిపోతున్నాయి. నామినేషన్ రోజు చాలా హాట్ హాట్ డిస్కషన్ జరగగా, తర్వాత రోజు అంత కన్నా ఎక్కువగా వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. కొందరైతే ఆవేశంతో మూగిపోయారు.
ఎపిసొడ్ మొదట్లో ప్రియాంక తన బాధని తోటి సభ్యులకు చెప్పుకుంది. ట్రాన్స్ జెండర్‌గా మారకుండా వేరే వాళ్లని పెళ్లి చేసుకుని ఉంటే.. నన్ను నేను మోసం చేసుకోవడమే కాకుండా.. మరో అమ్మాయికి అన్యాయం చేయాల్సి వస్తుందని అనుకున్నా. అందుకే నా స్నేహితురాలి సాయం తీసుకొని ఫ్లైట్ ఎక్కి వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నా. ఆ తర్వాత నా నరాలన్నీ మిక్సీలో వేసినట్టు అయింది. నరకం చూశానంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక సింగ్.
ముందుగా ఉమాదేవి.. ఇంట్లో ఎవరు సరిగా పనులు చేయడం లేదంటూ ఫైర్ అయింది. ఆ తర్వాత లోబో కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు.ఇంట్లో బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఆరేస్తున్నారు.నేను చింపేస్తానంటూ మండిపడ్డాడు. ఇక తర్వాత పవర్ రూం పవర్ కోసం ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో గెలుపొందిన విశ్వ.. బిగ్ బాస్‌కి రెండు పేర్లు చెప్పారు. ప్రియ, రవి అని బిగ్ బాస్‌కి విశ్వ చెప్పడంతో దీంతో బిగ్ బాస్ వారిద్దరిని బట్టలు మొత్తం తెచ్చి స్టోర్ రూంలో పెట్టాలని అన్నాడు.
తన బట్టలన్నీ పోవడంతో రవి అమ్మాయి డ్రెస్ ధరించి వినోదం పంచాడు. ఇక ప్రియా బాయ్స్ డ్రెస్ ధరించింది. ఇక యాంకర్ రవి.. తనని అన్నా అని పిలవడంతో.. తన తమ్ముడ్ని గుర్తు చేసుకొని బోరున ఏడ్చాడు. అనంతరం సిరి-లోబో మధ్య పెద్దగానే గొడవ అయింది. ఇదంతా ఫన్నీ అని తర్వాత అర్ధమైంది. కాకపోతే మోతెబరిలా మాట్లాడకు, ముఖం అద్దంలో చూసుకో, హైట్ చూసుకో, నా ముందు చెటాకంత ఉన్నవ్ అంటూ లోబో నానా మాటలు అనగా, ఫేస్ గురించి మాట్లాడితే ముఖం పగిలిపోద్ది అని వార్నింగ్ ఇచ్చింది సిరి . ఇదంతా వుట్టి డ్రామా అని తేలేసరికి అందరు నాలుక కరచుకున్నారు.
తర్వాత పవర్ రూం టాస్క్‌లో భాగంగా ఈసారి మానస్‌కి అవకాశం లభించింది.. ఈ పవర్ ప్రకారం హౌస్‌లో అందరూ పడుకున్న తరువాతే పడుకోవాలి.దీనికి మానస్.. ఆర్జే కాజల్‌ని ఎంచుకున్నాడు. అనంతరం కాజల్- లహరి మధ్య భారీగానే గొడవైంది. నీలో పాజిటివ్ వైబ్స్ లేవు.. అటాకింగ్ పొజిషన్‌కి వస్తే నేను ఒప్పుకోను.. నువ్ ఇక్కడికి ఎందుకు వచ్చావో నేనూ అందుకే వచ్చా.. బిగ్ బాస్ నీకు డ్రీమ్ ఎలాగో నాకూ డ్రీమ్ అంతే అంటే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. చివరకి కాజల్ వెనక్కి తగ్గి సారీ చెప్పింది.
ఇక జెస్సీ మరోసారి హమీదాతో గొడవకు దిగాడు. దీంతో ఆనీ మాస్టర్ ఇచ్చిపడేసింది. కూర్చుని ఉండే స్టూల్‌పై కాలుపెట్టి జెస్సీ తన యాటిడ్యూడ్ చూపించాడు. దీంతో ఆనీ మాస్టర్ అతనిపై రంకెలు వేసి రచ్చ రచ్చ చేసింది. మొత్తానికి రెండో రోజు మాత్రం దూషణలు,గొడవలతో రచ్చగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bigg boss
- bigg boss5
- siri
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

