బిగ్ బాస్.. ఇప్పుడు ఈ షో బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరించడమే కాక టీఆర్పీ రికార్డులని చెరిపేస్తుంది. ఈ షోలకి స్టార్ హీరోలు హోస్ట్‌గా ఉండడంతోపాటు టీవీ, సినిమా, యూట్యూబ్‌లకు చెందిన ఆర్టిస్ట్‌లు కంటెస్టెంట్స్‌గా వస్తుండడంతో షోపై రోజురోజుకు ఆసక్తి పెరుగుతుంది. అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్న ఈ షోకి మూల కర్త హలాండ్కి చెందిన జాన్ డే మోల్.
స్క్రిప్ట్ లేకుండా రియాలిటీతో ఓ షో చేస్తే ఎలా ఉంటుందోనని ఆలోచించాడు జూన్ డే మూల్. నెదర్లాండ్ వంటి చిన్న దేశంలో ప్రారంభమైన బిగ్‌బ్రదర్ రియాల్టీ షో బిగ్‌బాస్‌గా మారి ప్రపంచ దేశాలను చుట్టేసింది. తన ఆఫీసులో పని చేసే ఓ ఉద్యోగి, ఓ రోజు మాటల సందర్భంగా తాను చదివిన అమెరికన్ సైన్స్ జర్నల్‌లోని అంశాలను జాన్‌తో చర్చించాడు. ఈ సందర్భంలో బయో స్పియర్ పేరుతో అమెరికా ఓ సైంటిఫిక్ రీసెర్చ్ చేపట్టాలనుందని, అందులో భాగంగా ఒక పెద్ద గాజు భవంతిని నిర్మించి అందులో కొందరు మనుషులను ఉంచాలనుకుందని చెప్పాడు.
గాజు గ్లాసు లోపల మనుషుల మనుగడ ఎలా ఉంటుందనే ఆలోచన అంశం జాన్ దృష్టిని ఆకర్షించింది. బయో స్పియర్ కాన్సెప్టుకి కార్యరూపం ఇచ్చేందుకు తన మెదడుని మథించాడు జాన్. అప్పుడే అతని బుర్రలో ఫ్లాష్‌లా మెరిసింది జార్జ్ ఓర్వెల్ రాసిన 1984 అనే నవల. అప్పుడు ప్రజలని కంట్రోల్ చేసేందుకు దేశమంతటా కెమెరాలు అమర్చుతారు.వ్యక్తిగత జీవితాన్ని కూడా పరిశీలించేవారు.
దీనిని బేస్ చేసుకొని జాన్ డీ మోల్ .. పది మంది నటులతో ఎటువంటి స్క్రిప్ట్ లేకుండా 120 కెమెరాలతో షూట్ చేసారు. అయితే మొదట్లో ఎవరికి నచ్చలేదు. మొదటి సీజన్ షూట్ పూర్తియినా అడ్వర్టైజ్మెంట్లు రాలేదు. గుండె ధైర్యంతో ప్రోగ్రామ్‌ను ప్రసారం మొదలుపెట్టారు. నాలుగు వారాలు గడిచాక ఊపందుకొని ఇప్పుడు ప్రపంచం అంతా పాకింది. బిగ్‌బాస్ మాతృక బిగ్‌బ్రదర్ కార్యక్రమానికి మొదట అనుకున్న పేరు గోల్డెన్ కేజ్.
బిగ్బ్రదర్తో పాటు యూటోఫియా, ది వాయిస్, ఫియర్ ఫ్యాక్టర్, డీల్ ఆర్ నో డీల్ వంటి అనేక రియాల్టీ షోలను అందించారు జాన్ డే మోల్. పెద్ద సంస్థలతో సంబంధం లేకుండా ప్రపంచంలోనే వ్యక్తిగతంగా అత్యధికంగా ప్రోగ్రామ్స్‌ను సృష్టించిన నిర్మాతగా ఆయన రికార్డు సృష్టించారు. ఆయన ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చిన అనేక రియాల్టీ షోలు వివిధ పేర్లతో వివిధ రూపాల్లో అలరిస్తున్నాయి. 76 దేశాల్లో 295 ఛానల్స్‌లో 800లకు పైగా రియాల్టీషోలుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.