Bigg Boss 5 Telugu : ఓవర్ కాన్ఫిడెన్స్ ముంచేసింది.. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరంటే..

bigg boss 5 first week elimination | నేను గెలుస్తాను అనేది కాన్ఫిడెన్స్.. నేనే గెలుస్తాను అనేది ఓవర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఒక కంటెస్టెంట్ విషయంలో ఇదే జరిగింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేవలం అతి విశ్వాసం కారణంగా ఆమె తొలి వారం ఎలిమినేట్ అయిపోతుంది అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. బయట మంచి ఫాలోయింగ్ ఉన్న కూడా అది ఓట్ల రూపంలో కన్వర్ట్ కాలేదు. బిగ్ బాస్ 5 తెలుగు తొలి వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. అందులో ఇప్పటికే యాంకర్ రవి, హీరోయిన్ హమీదా సేవ్ అయ్యారు. ప్రస్తుతం నామినేషన్స్‌లో సీరియల్ నటుడు మానస్, ఆర్జే కాజల్, మోడల్ జస్వంత్, యూ ట్యూబర్ సరయు ఉన్నారు. వీళ్లలో కచ్చితంగా సేవ్ అయ్యే ఒక కంటెస్టెంట్ మానస్. తొలి వారం ఇంట్లో ఎవరితో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా చాలా సున్నితంగా ఉన్నాడు మానస్. ఈయనపై అందరికీ పాజిటివ్ ఒపీనియన్ ఉంది. బయట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో కచ్చితంగా ఎలిమినేషన్ నుంచి బయటికి వస్తాడనే నమ్మకం అందరిలోనూ ఉంది.
ఇక ఆర్జే కాజల్ కూడా తొలివారం నామినేషన్ నుంచి సేఫ్ అయిపోయిందని తెలుస్తోంది. ఈమె కోసం బయట పీఆర్ టీం పని చేస్తుందంట అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరోవైపు మొన్నటి వరకు డేంజర్ జోన్లో ఉన్నట్లు కనిపించిన మోడల్ జస్వంత్ జైలుకు వెళ్లిన తర్వాత సింపతి ఓట్లు బాగానే దక్కించుకున్నాడు. ఎటు చూసుకున్న కూడా ఈ వారం బయటికి వచ్చే కంటెస్టెంట్ సరయు అని అర్థమవుతుంది. తొలి వారం ఇంట్లో ఎవరినీ పెద్దగా కలుపుకోలేదు ఈమె. తనకు నచ్చిన ఒకరిద్దరితోనే ఎక్కువగా ఉంది. పోనీ షణ్ముఖ్ జస్వంత్ మాదిరి సైలెంట్‌గా తన పని తాను చేసుకుందా అంటే అదీ లేదు.
ఎక్కువగా గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నించింది. మామూలుగా రియాక్ట్ అయ్యే విషయానికి కూడా హైపర్ అయిపోయి అనవసరంగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది సరయు. ఇదే ఈమెకు మైనస్‌గా మారింది. తొలి వారం ఎలిమినేషన్ సరయు అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. ఇక నాగార్జున చెప్పడం మాత్రమే తరువాయి. ఇంట్లో ఉన్న వారం రోజులు ఈమెలో ఏదో తెలియని ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించింది అంటూ మిగిలిన కంటెస్టెంట్స్ చెప్పారు. దానికి తోడు ఎదుటివారికి సమాధానం చెప్పే స్టైల్ కాస్త విభిన్నంగా ఉందంటూ కొందరు కంటెస్టెంట్స్ గుసగుసలాడుతున్నారు. బయట ప్రేక్షకులు కూడా ఇలాగే వెళ్లింది సరయు క్యారెక్టర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
bigg boss 5 telugu | అప్పుడు సంపూర్ణేశ్ చేసిందే.. ఇప్పుడు లోబో చేయబోతున్నాడా..?
Bigg Boss : బిగ్ బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న హాట్ యాంకర్
తనకు తానే ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చుకున్న ప్రభాస్ హీరోయిన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

