bigg boss 5 telugu | అప్పుడు సంపూర్ణేశ్ చేసిందే.. ఇప్పుడు లోబో చేయబోతున్నాడా..?

bigg boss 5 telugu | బిగ్ బాస్ షో అందరికీ నచ్చాలని రూల్ లేదు. ఈ రియాలిటీ షో మీద ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అందులో పాల్గొనడానికి వచ్చిన కంటెస్టెంట్స్‌లో కూడా కొందరికి బిగ్ బాస్ కాన్సెప్ట్ నచ్చదు. కానీ పరిస్థితుల ప్రభావంతో వాళ్లు అక్కడికి వస్తారు. ఈ సీజన్ లో కంటెస్టెంట్‌గా వచ్చిన కమెడియన్ లోబో కూడా బిగ్‌బాస్ షో పై గతంలో విమర్శలు చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో మనోడిని ఓ రేంజ్లో ట్రోలింగ్ కూడా చేశారు. అయితే మొదటి మూడు నాలుగు రోజులు బాగానే కామెడీ చేసిన లోబో.. నాలుగో రోజు నుంచి మారిపోయాడు.
ఇంట్లో ఒక టాస్క్‌లో భాగంగా షణ్ముఖ్ జస్వంత్‌కు పనివాడిగా మారిపోయాడు లోబో. ప్రతి పని ఆయనతో చేయించుకుంటున్నాడు షణ్ముఖ్. మరోవైపు యాంకర్ రవి కూడా లోబో దగ్గర పనులు చేయించుకుంటున్నాడు. దీనిపై స్మోకింగ్ రూమ్‌లోకి వచ్చి బాధపడుతున్నాడు లోబో. తనకు కూడా సమయం వస్తుందని చెబుతున్నాడు. అంతేకాదు తనకు ఈ బిగ్ బాస్ షో అనేది అస్సలు నచ్చదని.. తన టేస్ట్ కాదు అంటూ సంచలన కామెంట్ చేశాడు. ఇక్కడ ఉండలేకపోతున్నాను అంటూ బాధపడ్డాడు. దీనిపై కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.
అంత ఇష్టం లేకుండా ఎందుకు వచ్చావు.. వచ్చిన తర్వాత ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ ఆయనపై విమర్శల వర్షం కురుస్తోంది. తొలి సీజన్లో సంపూర్ణేశ్ బాబు సెల్ఫ్ ఎలిమినేషన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. రెండు వారాలు కూడా కాక ముందే తాను ఇక్కడ ఉండలేకపోతున్నాను ఇంటికి పంపించేయండి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు సంపూర్ణేశ్ బాబు. దాంతో బిగ్‌బాస్ అతడిని మధ్యలోనే ఇంటికి పంపించేశాడు. ఇప్పుడు లోబో పరిస్థితి చూస్తుంటే కూడా అదే అనిపిస్తుంది. ఇంట్లో పరిస్థితులు ఆయన అసలు తట్టుకోలేకపోతున్నాడు. కచ్చితంగా రాబోయే రెండు మూడు వారాల్లోనే ఈ కమెడియన్ బయటకు వచ్చేస్తాడని అంచనా వేస్తున్నారు. ఒక్కసారి నామినేషన్లోకి వస్తే ఎలిమినేషన్ అయ్యేలా కనిపిస్తున్నాడు లోబో.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
sai dharam tej : నా ఇంటి నుంచి వెళ్తుండగానే యాక్సిడెంట్ జరిగింది : నరేశ్
Bigg Boss: బిగ్ బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న హాట్ యాంకర్
Prabahs: సైలెంట్‌గా యూకే వెళ్లిన ప్రభాస్ .. ఎందుకో తెలుసా?
Sai Dharam Tej: సాయి తేజ్ బైక్‌పై చలానా.. ఎందుకు వేసారో తెలుసా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

