బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో ఐదో సీజన్ జరుపుకుంటుంది. ఈ సారి 19 మంది కంటెస్టెంట్స్ షోకి హాజరు కాగా, వీరందరు టీవీ, సినిమా, సోషల్ మీడియా బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు. ప్రస్తుతం ఈ 19 మంది హౌజ్లో నానా హంగామా చేస్తుండగా, ఇప్పుడు కొంత కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.
గత సీజన్ ల కంటే ఈ సీజన్ మరింత కొత్తదనంతో ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇందులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న కంటెస్టెంట్ పేరు ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రతి సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ నాలుగో వారంలో ఉండగా ఈ సీజన్ లో రెండవ వారంలోనే ఎంట్రీ ఉంటుందని తెలిసింది. ఇందులో బుల్లితెర యాంకర్ హాట్ బ్యూటీ వర్షిణి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. వర్షిణి ప్రస్తుతం బుల్లితెరపైనే కాకుండా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఈ హాట్ బ్యూటీ హజ్లోకి ఎంట్రీ ఇస్తే రచ్చ మరోలా ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ వారం హౌజ్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్న విషయం తెలిసిందే.