Kriti Sanon: తనకు తానే ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చుకున్న ప్రభాస్ హీరోయిన్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘వన్.. నెనొక్కడినే’ సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చింది అందాల తార కృతి సనన్. ఢిల్లీలో జన్మించిన ఈ చిన్నది బాలీవుడ్ కాకుండా టాలీవుడ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం.కృతికి టాలీవుడ్ పెద్దగా కలిసి రాకపోవడంతో బాలీవుడ్‌కే వెళ్లింది. బాలీవుడ్లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళుతోందీ బ్యూటీ.
ఇటీవల మిమీ చిత్రంతో పలకరించిన కృతి సనన్ ఈ సినిమాతో మంచి విజయాన్నితన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా సక్సెస్, ప్రభాస్‌తో భారీ బడ్జెట్ చిత్రంలో నటించడంతో పాటుగా పలు క్రేజీ ప్రాజెక్టులు ఆమె చేస్తుంది. ఈ క్రమంలో తనకు తానుగా ఓ ఖరీదైన కారుని బహుమతిగా ఇచ్చుకుంది కృతి.
సరికొత్త మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 కారును తనకు తానే గిఫ్ట్‌గా ఇచ్చుకున్నారు కృతీ సనన్. దీని ఖరీదు సుమారు 2 కోట్ల రూపాయల ఉంటుందని సమాచారం. ఈ కొత్త మెర్సిడెస్-మేబాచ్ జీఎల్ఎస్ 600 లగ్జరీ కారు కృతీ కార్ల సేకరణకు అదనపు ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం కృతి కారుకి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం కృతి .. ఆదిపురుష్‌తో పాటు బచ్చన్ పాండే, భేదియా, గణపత్,హమ్ దో హమారే దో వంటి చిత్రాలలో నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

