Aari Arjunan | దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ డైరెక్షన్లో వస్తోన్న చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ (GS). తమిళ, తెలుగు భాషల్లో వస్తోన్న చిత్రం . ఇప్పటికే విడుదల చేసిన మాస్ అండ్ ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో ట్రైజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీతో బిగ్ బాస్ (తమిళం)విన్నర్ ఆరి అర్జునన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
ఇందులో ఆరి అర్జునన్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో నిజాయితీ, ముక్కుసూటితో వ్యవహరించే పోలీసాఫీసర్‌గా ఆరిఅర్జునన్ కనిపించబోతున్నాడట. ఈ సినిమాతో రాజ్తరున్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. భరత్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అమ్ము అభిరామి హీరోయిన్గా నటిస్తోంది.
దర్శకుడు విజయ్ మెల్టన్ మాట్లాడుతూ.. మా ట్రైజర్‌ను విడుదల చేసి మాకు ప్రోత్సాహం అందించిన దర్శకుడు హరీష్ శంకర్‌కు ధన్యవాదాలు. భారీ స్థాయిలో, భావోద్వేగాల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం, వాస్తవిక కథనంతో పాటు వాణిజ్య అంశాలను మేళవించిన సినిమాటిక్ అనుభూతిని ప్రేక్షకులకు అందించనుంది. ఈ చిత్రంలో మంచి టాలెంటెడ్ నటీనటులు సరికొత్త అవతారంలో కనిపంచబోతున్నారన్నారని ఇప్పటికే డైరెక్టర్ విజయ్ మిల్టన్ క్లారిటీ ఇచ్చేశారు.
స్వతంత్ర సంగీత కళాకారుడు వేధన్ కూడా కీ రోల్లో నటిస్తున్నాడని కూడా చెప్పాడు. రఫ్ నోట్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. యాక్షన్, భావోద్వేగం, సామాజిక అంశాల సమ్మేళనంగా తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతుంది.