Bigboss-7 | బిగ్‌బాస్ సీజన్-7లో రెండో వారం నామినేషన్ ప్రక్రియ వాడీవేడిగా సాగింది. సోమవారం పల్లవి ప్రశాంత్ నామినేషన్ ఎంత రసవత్తరంగా సాగిందో.. మంగళవారం శోభా శెట్టి నామినేషన్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా సాగింది. ఇక శోభాశెట్టి శివాజీని నామినేట్ చేసింది. దాంతో వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అదే కోపంలో శివాజి ‘నువ్వు నన్ను నామినేట్ చేశావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను’ అంటూ శోభా శెట్టిని నామినేట్ చేశాడు. ఇక నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యాక వీళ్లిద్దర మధ్య అసలైన గొడవ స్టార్ట్ అయింది.
‘అసలు కారణం లేకుండా నువ్వు నన్ను నామినేట్ చేశావు’ అంటూ శివాజీని శోభా విమర్శింది. దాంతో సీరియస్ అయిన శివాజీ ‘కారణం లేకపోవడం ఏంటి? నువ్వు కలిసికట్టుగా ఆడుతున్నావు’ అంటూ విమర్శించాడు. కానీ ఆ వ్యాఖ్యలను శోభా శెట్టి ఒప్పుకోలేదు. వీళ్ల గొడవ అంతటితో ఆగలేదు. ‘నేను వాదించడం మొదలుపెడితే తట్టుకోలేవు. వదిలేయ్’ అంటూ శివాజీ శోభాని అనగా శోభా ‘నాకు కూడా మాటలు వచ్చు’ అని కౌంటర్ వేసింది. దానికి శివాజి అన్ని ‘అంటే తట్టుకోలేవు , నువ్వు అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండకు’ అని మాటల యుద్దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఇక శోభ సైతం శివాజీకి ‘బయట ఉన్నట్టు ఇక్కడ ఉండొద్దు మీరు. బయట అది చేశాను, ఇది చేశాను అని చెప్పుకోవద్దు’ అంటూ రివర్స్‌లో కౌంటర్లు వేస్తూనే ఉంది.
ఇలా మంగళవారం ఎపిసోడ్ మొత్తం రచ రచ్చగా సాగింది. ఈ వారం శివాజీ, ప్రశాంత్, రతిక, తేజ, అమర్దీప్, షకీలా, గౌతమ్, శోభా, ప్రిన్స్, నామినేట్ అయ్యారు. ఇక పవర్ అస్త్ర గెలుచుకున్న సందీప్ ఇంటి సభ్యుడు అయిపోయాడు. ఇంటిలోని మిగితా కంటెంస్టెంట్స్ అది గెలుచుకోవడానికి ఓ గేమ్ ఆడాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. ఆ గేమ్‌కు మాయ అస్త్ర అనే పేరు పెట్టాడు. ఈ టాస్క్‌లో రణధీర టీమ్, మహాబలి టీమ్ రెండు గ్రూపులుగా ఏర్పడి గేమ్‌ను ఆడారు. ఇక ఈ టాస్క్‌లో రణధీర టీమ్ మూడు పాయింట్లు గెలిచి పవర్ అస్త్ర తాళాన్ని దక్కించుకుంది. ఇలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది.