Kantara Movie | ‘కాంతార’ సినిమాలోని వరాహరూపం సాంగ్ కాపీ అని, అది తమదేనని థైక్కుడం బ్రిడ్జ్ అనే సంస్థ గతేడాది కేసు వేసింది. కాగా ఇన్ని రోజులకు చిత్రబృందానికి ఊరట లభించింది. వరాహరూపం పాటను సినిమా నుంచి తొలగించాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దర్శకుడు రిషబ్‌శెట్టి, నిర్మాత విజయ్ కిరందూర్కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది. ఈ నెల 12,13 తేదీల్లో వీరు దర్యాప్తుకు హాజరైతే అరెస్ట్ చేయోద్దని ఆదేశించింది.
థైక్కుడం బ్రిడ్జ్ నవరసం అంటూ క్రియేట్ చేసిన ఆల్బమ్‌ను మేకర్లు వరాహరూపంగా మార్చేసి కాపీ కొట్టారనేది గతేడాది నవంబర్‌లో కేసు నమోదయింది. దాంతో ఈ పాట వివాదమైంది. దాంతో ఓటీటీ నుండి ఆ పాటను తీసేసారు. ఆ పాట ప్లేస్‌లో మరో ట్యూన్‌ను యాడ్ చేశారు. ఇక గతేడాది సెప్టెంబర్‌లో భారీ అంచనాల నడుమ కన్నడలో రిలీజైన ఈ సినిమా మొదటి రోజు నుండి పాజిటీవ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు వస్తున్న ఆధరణతో అన్ని భాషల ప్రేక్షకుల నుండి భారీ డిమాండ్ ఏర్పడింది.
దాంతో మేకర్స్ పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇక రిలీజైన ప్రతి భాషలో భారీ వసూళ్ళను సాధిస్తూ డబుల్ బ్లాక్‌బస్టర్ నిలిచింది. ఇటీవలే ఈ సినిమాకు ప్రీక్వెల్ ఉండనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపకుంటున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనుంది. ఈ సారి మరింత గ్రాండ్‌గా రూపొందాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.