Actress Hema | బెంగళూరు రేవ్‌పార్టీ కేసు (Bengaluru rave party case)లో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన తెలుగు సినీ నటి హేమ (Actress Hema)కు భారీ ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి చర్యలపై కర్ణాటక హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. తనపై నమోదైన చార్జ్‌షీట్‌కి సంబంధించి ఇటీవలే న్యాయస్థానం ఆశ్రయించింది హేమ. అయితే దీనిపై విచారణ చేప్పటింది న్యాయస్థానం. ఈ రేవ్ పార్టీలో హేమ ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదని.. నిషేధిత పదార్థాలను తీసుకొన్నట్లు నిర్ధరించడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఆమె తరపున న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదించారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు దీనిపై మధ్యంతర స్టే విధించింది. నాలుగు వారాల తర్వాత ఈ కేసుపై విచారణ చేపట్టునున్నట్లు ధర్మాసనం తెలిపింది. అప్పటివరకు స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది.
2024 మే 19న కర్ణాటక రాజధాని బెంగళూరులో రేవ్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని బీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో మందుతోపాటు పెద్ద ఎత్తున మత్తుపదార్థాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు టీవీ నటీనటులు (Telugu Stars), మోడళ్లు, బడాబాబులు పట్టుబడ్డారు. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు. డ్రగ్స్ టెస్ట్‌లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. హేమతో పాటు డ్రగ్స్ టెస్ట్‌లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించారు. ఈ కేసులో జూన్ 3న హేమను పోలీసులు అరెస్ట్ చేయగా.. బెయిల్‌పై బయటకి వచ్చింది.