Bhoothaddam Bhaskar Narayana | టాలీవుడ్ యువ నటుడు శివ కందుకూరి (Shiva Kandukuri) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ (Bhoothaddam Bhaskar Narayana). ఈ సినిమాకు పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించగా రాశి సింగ్ కథానాయికగా నటించింది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ సంయుక్తంగా నిర్మించారు. కామెడీ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులని అలరించింది. అయితే ఈ సినిమా విడుదలై నెల రోజులు కూడా కాకముందే ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో మార్చి 22 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా వెల్లడించింది. ‘‘బొమ్మ కనిపించే ప్రతీసారీ దిమ్మతిరిగే ట్విస్ట్ ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ చూసేయండి’ అంటూ ఆహా రాసుకోచ్చింది.
బొమ్మ కనిపించే ప్రతీసారీ దిమ్మతిరిగే ట్విస్టు ఉంటది!
అదెంటో తెలుసుకోవాలని ఉందా?#BhoothaddamBhaskarNarayana Premieres March 22 ✌🏻@iam_shiva9696 @RaajPurushotham @RashiReal_ @adityamusic pic.twitter.com/bbHmAtMx51— ahavideoin (@ahavideoIN) March 16, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కర్ణాటక ఆంధ్ర బోర్డర్లో జరిగిన వరుస హత్యల ఆధారంగా ఈ సినిమా వచ్చింది. ఇక దిష్టి బొమ్మ హత్యలుగా ఫేమస్ అయిన ఈ మర్డర్స్ ను కనిపేట్టే డిటెక్టివ్ భాస్కర్ నారాయణ పాత్రలో శివ కందుకూరి నటిస్తున్నాడు. క్రైమ్ థ్రిల్లర్గా వచ్చిన ఈ చిత్రంలో అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్ కీలకపాత్రలు పోషించారు.