Bhola Shankar Teaser | వాల్తేరు వీరయ్యతో బంపర్ హిట్ అందుకున్న చిరు.. ప్రస్తుతం అదే ఊపులో భోళా శంకర్‌ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు, లిరికల్ సాంగ్ కాస్త మంచి హైపే తెచ్చిపెట్టాయి. అయితే శనివారం సాయంత్రం విడుదల కాబోతున్న టీజర్‌పైనే అందరి చూపు ఉంది. ఇప్పటికే టీజర్ కట్‌ను కూడా రెడీ చేశారు. టీజర్ అద్భుతంగా ఉందని, వింటేజ్ చిరు కనిపిస్తాడని ఇన్సైడ్ టాక్. ఇక టీజర్ రిలీజ్‌ను మేకర్స్ పెద్ద ఎత్తులో ప్లాన్ చేశారు. ఈ మేరకు ఫలానా థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ఇక భోళా శంకర్ టీజర్ రిలీజయ్యే లిస్ట్‌ను చిత్రబృందం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరులోని ఓ థియేటర్ సహా మొత్తం నలభై థియేటర్లలో సాయంత్రం 5:30 నిమిషాలకు ఈ సినిమా టీజర్ స్క్రీనింగ్ కానుంది. టీజర్ స్క్రీనింగ్‌కు చిరు అభిమానులు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ సంధ్య 70ఎంఎం థియేటర్ దగ్గర పెద్ద ఎత్తన ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాడు చేశారు. తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళం సినిమాకు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కబోతుంది. చిరుకు చెల్లెలిగా కీర్తి సురేష్ నటించగా.. హీరోయిన్గా తమన్నా కనిపించనుంది. ఏకే ఎంటర్టైనమెంట్స్, క్రియేటీవ్ కమర్శియల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక షాడో తర్వాత మెహర్ రమేష్ దాదాపు పదేళ్లకు మళ్లీ ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టాడు.