Bhola Shankar | మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న తాజా చిత్రం భోళా శంకర్ (Bhola Shankar). మెహర్ రమేశ్ డైరెక్షన్లో వేదాళమ్ రీమేక్‌గా తెరకెక్కుతుంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా..చిరంజీవి సోదరిగా కీర్తిసురేశ్ నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన భోళా శంకర్ స్టిల్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. మేకర్స్ భోళా మ్యూజికల్ మేనియా (BholaaMania) త్వరలోనే షురూ కానుందంటూ న్యూస్ కూడా షేర్ చేశారు. ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ అందించారు.
సాంగ్ ప్రోమోను జూన్ 2న, ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను జూన్ 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. చిరంజీవి స్టైలిష్ గాగుల్స్ తో నడుచుకుంటూ వస్తున్న లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. భోళాశంకర్ ఆడియో ఆల్బమ్ ఎలా ఉండబోతుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నా మెగా అభిమానులు. తాజా అప్డేట్ ప్రకారం జూన్ చివరి నాటికి షూటింగ్ పూర్తి కానుంది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ చేయనున్నారు. భోళా శంకర్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.
ఈ మూవీలో మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ రవి శంకర్, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. చిరంజీవి ఈ ఏడాది బాబీ డైరెక్షన్లో నటించిన వాల్తేరు వీరయ్య మంచి హిట్‌గా నిలిచింది. ఇక చాలా కాలం తర్వాత డైరెక్టర్‌గా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు మెహర్ రమేశ్. మరి భోళాశంకర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మేనియాను సృష్టిస్తుందనేది చూడాలి.
ఫస్ట్ సాంగ్ అప్డేట్ లుక్..
Let’s begin the sound of #BholaaShankar 🔱 with #BholaaMania 🤟🏻
Song Promo out Tomorrow 🔥
Full Lyrical Song on June 4th 💥
“ MEGA FESTIVAL “@SagarMahati thumping musical🥁Mega🌟@KChiruTweets in
stylish mass presentation🔥@AnilSunkara1 @dudlyraj @ramjowrites… pic.twitter.com/ikMgyfMh47— Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) June 1, 2023
The wait is over🌟 for the
MEGA MUSIC MANIA of #BholaaShankar 🔱#BholaaMania Starts Soon 📣 🎶💥Stay Tuned❤️🔥 @SagarMahati thumping musical 🥁#BholaaShankarOnAug11thMega🌟 @KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @dudlyraj @ramjowrites @Sekharmasteroff @AKentsOfficial pic.twitter.com/gahisr0KDf
— AK Entertainments (@AKentsOfficial) May 30, 2023