కేంద్రప్రభుత్వం ప్రారంభించిన జన్‌ధన్ పథకం ఓ గ్రామంలో ఓ పేదవాడి జీవితాన్ని, ఆ కుటుంబాన్ని ఏ విధంగా విపత్తుల పాలు జేసింది, వారి ప్రశాంతమైన జీవితాలను ఏ విధంగా అల్లకల్లోలం చేసింది అనే ఇతివృత్తంతో రూపొందిన చిత్రమే ‘భీమదేవరపల్లి బ్రాంచ్’. రమేష్ చెప్పాల దర్శకత్వంలో కీర్తీలత బత్తిన, రాజా నరేంద్ర నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుంది. నిర్మాత మాట్లాడుతూ ‘ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ,ఉత్కంఠభరితమైన మలుపులతో, ఎమోషనల్‌గా సాగే సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చిత్రం వుంటుంది. సమాజంలో జరుగుతున్న సంఘటనల ఆధారంగానే ఈ చిత్రాన్ని రూపొందించాం. చెప్పాలనుకున్న ఓ సందేశాన్ని పూర్తి వినోదాత్మకంగా చెప్పడానికి ప్రయత్నించాం’ అన్నారు.