Bhavana | సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు, రిలేషన్‌షిప్‌లు, ప్రెగ్నెన్సీలు ఇవన్నీ కామన్. అయితే తాజాగా ఓ ప్రముఖ నటి తాను పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నట్టు ప్రకటించడం సంచలనంగా మారింది. ఇంతకు ఆ నటి ఎవరు అనే కదా మీ డౌట్. ఆమె మరెవరో కాదు కన్నడ నటి భావన. ప్రస్తుతం 40 ఏళ్ల వయస్సులో ఉన్న భావన, ఐవీఎఫ్ విధానం ద్వారా కవలలకు జన్మనివ్వబోతున్నట్లు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా, తన బేబీ బంప్ ఫొటోను పంచుతూ, “ఇది నా జీవితం లో కొత్త అధ్యాయం” అని భావోద్వేగంతో తెలిపారు. “పెళ్లి కాకుండానే తల్లి కావడం గర్వంగా ఉంది” అని స్పష్టం చేసింది.
“నేను సింగిల్ మదర్‌గా నా పిల్లల్ని పెంచాలని నిర్ణయించుకున్నా. ఇది నా వ్యక్తిగత ప్రయాణం. నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నాకు పూర్తిగా మద్దతుగా ఉన్నారు. 20, 30 ఏళ్లలో నాకు పిల్లలు కావాలని అనిపించలేదు. కానీ ఇప్పుడు, 40 ఏళ్ల వయసులో పిల్లల అవసరాన్ని గుర్తించాను. ఈ విషయంలో చాలా మంది డాక్టర్లు నన్ను రిజెక్ట్ చేశారు. నా వయసు లో ఇది సాధ్యపడదని చెప్పారు. కానీ నేను నమ్మకాన్ని కోల్పోలేదు. ఎట్టకేలకు కుదిరింది. త్వరలో ఇద్దరు బేబీస్ నన్ను ‘అమ్మ’ అని పిలవబోతున్నాయి,” అని భావన తన భావోద్వేగాలను వ్యక్తం చేశారు.
భావన షేర్ చేసిన బేబీ బంప్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆమె ధైర్యాన్ని, బోల్డ్ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. “నిజంగా ఇది ప్రేరణ ఇచ్చేలా ఉంది”, “ఇది సింగిల్ మదర్లకు స్పూర్తిగా నిలుస్తుంది” అంటూ అనేక మంది అభినందనలు తెలుపుతున్నారు. భావన కేవలం కన్నడలోనే కాదు, మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లోనూ మంచి పేరు తెచ్చుకుంది. ఆమె నటన, అందం,గాంభీర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ నటి వ్యక్తిగతంగా తీసుకున్న బోల్డ్ నిర్ణయంతో మళ్లీ మీడియాలో హాట్ టాపిక్ అయింది.