రాజ్‌తరుణ్ తాజా సినిమా ‘భలే ఉన్నాడే’. మనీషా కంద్కూర్ కథానాయిక. జె.శివసాయివర్ధన్ దర్శకుడు. ఎన్వీ కిరణ్‌కుమార్ నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘ఏమవునో ఏమవునో.. ఈ జంట ఏమవునో.. ఎందాక సాగేనో ఈ పయనం తెలుసా..’ అంటూ సాగే ఈ పాటను కృష్ణకాంత్ రాయగా, శేఖర్‌చంద్ర స్వరపరిచారు. కపిల్ కపిలన్ ఆలపించారు. హీరోహీరోయిన్ల ప్రేమను ప్రజెంట్ చేస్తూ ఈ పాట సాగడం విశేషం. సింగీతం శ్రీనివాస్, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నగేశ్ బానెల్లా, సమర్పణ: మారుతీ టీమ్.