Bhaje Vaayu Vegam | ఆర్ ఎక్స్ 100(RX100) ఫేమ్ కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘భజే వాయు వేగం’(Bhaje Vaayu Vegam). యూవీ క్రియేషన్స్‌లో వస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ మోషన్ పోస్టర్ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. స్పీడుగా దూసుకుపోయే కారు, డిక్కీలో డబ్బుల మూటలతో ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగింది ఈ వీడియో. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా ట్రైలర్‌ను మే 25 మధ్యాహ్నం 12.15 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేం రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రథన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మే 31 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Buckle up for an exciting glimpse into the enthralling world of #BhajeVaayuVegam ❤️🔥#BVVTrailer out on May 25th at 12.15 PM 💥💥
Grand Release Worldwide on May 31st 🎯 #BVVonMay31st 🏏@ActorKartikeya @Ishmenon @RAAHULTYSON @Dir_Prashant @ajayrajup @RDRajasekar @radhanmusic… pic.twitter.com/OPexHT2mXN
— BA Raju’s Team (@baraju_SuperHit) May 23, 2024