కార్తికేయ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భజే వాయు వేగం’. ప్రశాంత్‌రెడ్డి చంద్రపు దర్శకుడు. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తున్నది. శనివారం ఈ సినిమా టీజర్‌ను అగ్ర నటుడు చిరంజీవి ‘విశ్వంభర’ సెట్లో విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు టీజర్ చాలా ఇంప్రెసివ్‌గా ఉందని, తన అభిమాని..తమ్ముడు లాంటి వాడు అయిన కార్తికేయ నటిస్తున్న ఈ సినిమా విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు. డ్రగ్స్ కేసు ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తండ్రీకొడుకుల బంధం ప్రధానంగా టీజర్ ఆకట్టుకుంది.
‘ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒకరుంటారు. వారి కోసం ఏం చేయడానికైనా మనం వెనకాడం. నా లైఫ్‌లో అది మా నాన్న’ అని కార్తికేయ చెప్పిన డైలాగ్ ఆసక్తిని పెంచింది. యాక్షన్ ఘట్టాలు కూడా ఆకట్టుకున్నాయి. ఐశ్వర్యమీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.డి.రాజశేఖర్, సంగీతం: రథన్, దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి చంద్రపు.