Bhairavam | ‘నాంది’ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయమైన విజయ్ కనకమేడల ఆ తర్వాత ‘ఉగ్రం’ మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు మూడో ప్రయత్నంగా ‘భైరవం’ మూవీతో మే 30న ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.అయితే ఓ ఈవెంట్లో విజయ్ కనకమేడల చేసిన కామెంట్స్ వైసీపీ శ్రేణులకి కోపం తెప్పించాయి. దాంతో భైరవం సినిమాని బహిష్కరిస్తున్నామంటూ #BoycottBhairavam హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేశారు. అదే సమయంలో కొన్ని పోస్ట్‌లని వైరల్ చేసారు. అది చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లను విమర్శిస్తూ విజయ్ కనకమేడల ఫేస్బుక్ అకౌంట్ లో పెట్టిన పోస్ట్.
అది పద్నాలుగేళ్ల క్రితం నాటిది కాగా, ‘భైరవం’ విడుదలకు ముందు దానిని బయటకు తెచ్చారు. దాంతో మెగా ఫ్యాన్స్ కూడా సినిమాని బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఆ సమయంలో విజయ్ .. ఎప్పుడో 2011లో ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టానని ట్రోల్ చేస్తున్నారు. అది నేను పెట్టిన పోస్ట్ కాదు.. ఏదో జరిగింది.. హ్యాక్ అయి ఉంటుంది. నేను మెగా హీరోల అందరితో సాన్నిహిత్యంగా ఉంటాను. నా అకౌంట్ ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చు.. కాబట్టి ఇలాంటి తప్పు ఇంకొకసారి జరగదు . మీలో ఒకడిగా నేను హామీ ఇస్తూ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను అని విజయ్ ఓ పోస్ట్ పెట్టారు. అయిన మెగా ఫ్యాన్స్ కోపం చల్లారలేదు. ఇటీవల మంచు మనోజ్ కూడా విజయ్‌కి మెగా ఫ్యామిలీ అంటే ఎంత రెస్పెక్ట్ ఉందో తెలియజేస్తూ ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టాలని అన్నారు.
ఇక ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ని రంగంలోకి దింపింది భైరవం టీమ్. ‘భైరవం’ ప్రమోషన్స్ లో భాగంగా మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేయగా ఇందులో హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొన్నారు. సరదా సిట్టింగ్ పేరుతో విడుదలైన వీడియోలో నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని క్యారమ్స్ ఆడుకుంటూ, టీ తాగుతూ సరదాగా మాట్లాడుకున్నారు. ప్రమోషన్స్ అయిపోయాయి కాబట్టి, రిలాక్స్ గా తాగేసి పడుకోవడమే అని మంచు మనోజ్ అనడం.. నారా రోహిత్ ఏంటి అంటే ..కాఫీ టీ అని చెప్పడం నవ్వు తెప్పిస్తుంది. సినిమా విడుదల అవ్వకముందే బెల్లంకొండ శ్రీనివాస్ ప్రీ రిలీజ్ సెలబ్రేషన్స్ చేయడంపైనా ఫన్నీగా మాట్లాడారు. పాత జ్ఞపకాలు, సినిమా సంగతులు అన్ని ముచ్చటించుకున్నారు. మరి మెగా హీరో ఎంట్రీతో మెగా ఫ్యాన్స్ చల్లబడతారా లేదా చూడాలి.