RAPO 22 | టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఫేం పీ మహేశ్ బాబు (Mahesh Babu P) డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీ పూజా కార్యక్రమాన్ని నవంబర్ 21న నిర్వహిస్తున్నట్టు ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన ప్రీ లుక్‌లో సైకిల్‌ను తోసుకుంటూ వెళ్తూ క్యూరియాసిటీ పెంచుతున్నాడు రామ్.
RAPO 22గా వస్తోన్న ఈ మూవీకి సంబంధించి తాజాగా హీరోయిన్ను పరిచయం చేశారు మేకర్స్. ఈ చిత్రంలో మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్య శ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అందమైన ప్రయాణంలో భాగమవుతున్న భాగ్యశ్రీబోర్సేకు స్వాగతం పలుకుతూ మేకర్స్ విడుదల చేసిన స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్‌తో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన భాగ్య శ్రీ బోర్సే.. ఈ సినిమాలో అందాలు ఆరబోసినా బాక్సాఫీస్ వద్ద సినిమా ఢీలా పడిపోయింది. మరి రామ్ సినిమాతోనైనా బ్రేక్ వస్తుందేమో చూడాలంటున్నారు సినీ జనాలు.
The recent sensation #BhagyashriBorse joins #RAPO22 adding her charm and brilliance to the beautiful journey ❤️🔥
The journey begins with the pooja ceremony tomorrow ✨
Stay tuned!
Starring @ramsayz
Written and directed by @filmymahesh
Produced by @MythriOfficial.#RAPO pic.twitter.com/9XehPKydAO— Mythri Movie Makers (@MythriOfficial) November 20, 2024
AR Rahman: భార్య సైరాకు బ్రేకప్ చెప్పిన ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్
Bacchala Malli | ఆ తేదీనే బచ్చలమల్లి.. అల్లరి నరేశ్ రిలీజ్ లుక్ వచ్చేసింది
Pushpa 2 The Rule | పుష్ప 2 ది రూల్ రిలీజ్ ఆన్ ది వే.. తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్..!