తన పెళ్లి విషయంలో ఓ క్లారిటీ ఇచ్చేశారు పూణే భామ భాగ్యశ్రీ బోర్సే. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? లేక అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడగ్గా.. ‘లవ్ మ్యారేజే చేసుకుంటా’ అంటూ తడుముకోకుండా సమాధానమిచ్చారు భాగ్యశ్రీ. ప్రస్తుతం లవ్‌లో ఉన్నారా? అనంటే.. ‘ప్రస్తుతమైతే లేదు.’ అని సింపుల్‌గా బదులిచ్చారామె.
లవ్‌లో లేకుండా లవ్మ్యారేజే చేసుకుంటానని అంత కరెక్ట్‌గా ఎలా చెబుతున్నారు? అని సదరు యాంకర్ రెట్టించి అడగ్గా.. ‘నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది. ఎప్పటికైనా నాకు నచ్చేవాడు, నన్ను మెచ్చేవాడు రాకమానడు. అది ఎప్పుడు అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. కానీ కన్ఫర్మ్గా లవ్ మ్యారేజే చేసుకుంటా.’ అని కుండ బద్దలు కొట్టారు భాగ్యశ్రీ బోర్సే. ఆమె హీరో రామ్‌కు జోడీగా నటించిన ‘ఆంధ్రకింగ్ తాలూకా’ సినిమా ఈ నెల 27న విడుదల కానున్నది.