ప్రస్తుతం ఇండస్ట్రీలో లక్కీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే అందరూ ఠక్కున భాగ్యశ్రీ బోర్సే పేరే చెబుతున్నారు. ‘మిస్టర్ బచ్చన్’తో తెలుగులో అరంగేట్రం చేసిందీ భామ. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా ఈ అమ్మడికి మాత్రం కావాల్సినంత గుర్తింపు దక్కింది. చూడగానే ఆకట్టుకునే చక్కటి రూపం, స్క్రీన్‌ప్రజెన్స్‌తో ఈ మరాఠీ సుందరి యువత హృదయాల్ని గెలుచుకుంది. ఇప్పుడీ సొగసరి విజయ్ దేవరకొండ సరసన ‘కింగ్డమ్’తో పాటు రామ్ సరసన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రంలో నటిస్తున్నది.
తాజా సమాచారం ప్రకారం నాని ‘ప్యారడైజ్’ చిత్రంలో కూడా భాగ్యశ్రీబోర్సే కథానాయికగా ఖరారైందని తెలిసింది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. ‘ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా కెళ్లి నడిచే శవాల కథ..’ అనే సంభాషణతో విడుదలైన ఫస్ట్‌గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. సికింద్రాబాద్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. కొద్దిరోజులుగా కథానాయిక అన్వేషణలో ఉన్న చిత్రబృందం భాగ్యశ్రీ బోర్సేను దాదాపుగా ఓకే చేసిందని ఫిల్మ్‌నగర్ టాక్. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.