అగ్గిలోన పుట్టినట్టి అయోనిజ..
తిరువీర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషిస్తున్న రొమాంటిక్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భగవంతుడు’. కన్నడ నటుడు రిషి కీలక పాత్రధారి. జి.జి.విహారి దర్శకుడు. రవికుమార్ పనస నిర్మాత. త్వరలోనే సినిమా విడుదల కానున్నది.
తిరువీర్, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలు పోషిస్తున్న రొమాంటిక్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భగవంతుడు’. కన్నడ నటుడు రిషి కీలక పాత్రధారి. జి.జి.విహారి దర్శకుడు. రవికుమార్ పనస నిర్మాత. త్వరలోనే సినిమా విడుదల కానున్నది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘ఓ.. యెల్లమ్మ..’ అంటూ సాగే ఈ పాటను చిత్ర దర్శకుడు జి.జి.విహారి స్వయంగా రాయడం విశేషం. డివైన్ ట్యూన్‌తో కేపీ స్వరపరచిన ఈ పాటను అడ్డుల జంగిరెడ్డి ఆలపించారు.
‘యెల్లమ్మంటే ఎవరనుకున్నరు? సూర్యవంశ రాజులింట రేణుకమ్మ పుట్టెరా.. దుర్గమ్మే వరమిచ్చిన ఆదిశక్తి అంశరా.. అగ్గిలోన పుట్టినట్టి అయోనిజ తల్లిరా.. జమదగ్నే మనువాడిన ముత్తైదువ అమ్మరా..’ అంటూ భక్తిభావం నింపేలా ఈ పాట సాగింది. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సహనిర్మాత: విద్య శ్రీపనస, నిర్మాణం: రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

