జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న యంగ్ హీరో..!

తెలుగులోనే ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ అందుకోలేదు అప్పుడే బాలీవుడ్ వెళ్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈయన హిందీ ఇండస్ట్రీకి వెళ్తుండటం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ ఈయనకు మాత్రం ఫుల్ క్లారిటీ ఉంది. సోషల్ మీడియాలో బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీపై సెటైర్లు కూడా పేలుతున్నాయి. తెలుగులో ఇప్పటి వరకు ఈయన నటించిన సినిమాల్లో రాక్షసుడు మాత్రమే విజయం సాధించింది. అల్లుడు శీను, జయ జానకీ నాయకా సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ ఫ్లాప్స్ అయ్యాయి. దాంతో ఇప్పటికీ తెలుగులో సేఫ్ హీరోగా గుర్తింపు రాలేదు ఈయనకు. మరోవైపు టాలీవుడ్ లో స్టార్ హీరోలు కూడా బాలీవుడ్ అంటే మనకెందుకు వచ్చిన గోలరా బాబూ అంటూ వెనకడుగు వేస్తుంటారు.
రామ్ చరణ్, వెంకటేష్ లాంటి కొందరు ట్రై చేసి చేతులు కూడా కాల్చుకున్నారు. ఇలాంటి సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఇంత ధైర్యంగా ముందడుగు వేయడానికి ఆయన దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ కారణం. మరీ గుడ్డిగా ఆయన బాలీవుడ్ వెళ్లట్లేదు. తన సత్తా తెలుసు కాబట్టే వెళ్తున్నాడు. అర్థం కాలేదు కదా.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పటికే హిందీ ఆడియన్స్ కు బెల్లంకొండ శ్రీనివాస్ ఎవరో తెలుసు.. ఆయన రేంజ్ గురించి ఐడియా ఉంది. ఈయన తెలుగు డబ్బింగ్ సినిమాలకు యూ ట్యూబ్ లో అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. 100 మిలియన్ వ్యూస్ కూడా వస్తున్నాయి. అక్కడ ఈయన డబ్బింగ్ సినిమాలకు కూడా 10 కోట్లకు పైగానే డిమాండ్ ఉంది. అందుకే ఛత్రపతి లాంటి మాస్ సినిమాతో అక్కడికి వెళ్తున్నాడు.
అల్లుడు శీను, జయ జానకి నాయక లాంటి సినిమాలతో పాటు కవచం లాంటి డిజాస్టర్ సినిమాలు కూడా హిందీలో రచ్చ చేసాయి. అందుకే యూ ట్యూబ్ లో వచ్చిన గుర్తింపుతో మరో అడుగు ముందుకేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. మరోవైపు ఛత్రపతి లాంటి యాక్షన్ సినిమాతో వస్తే ఆ ఇంపాక్ట్ మరింత ఉంటుందని భావిస్తున్నాడు బెల్లంకొండ. వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్ ను తీసుకోవడం వెనక కూడా కారణం అదే. ఈ సినిమా షూటింగ్ అయిపోయింది. చాలా వేగంగా.. ఎలాంటి సందడి లేకుండా చత్రపతి హిందీ రీమేక్ పూర్తి చేసాడు వినాయక్. తెలుగులో ఈయన్ని పరిచయం చేసింది వినాయకే. హిందీలో కూడా బెల్లంకొండను ఆయనే పరిచయం చేస్తుండటం విశేషం. మరి బెల్లంకొండ ఆశలు ఛత్రపతి రీమేక్ ఎంతవరకు నిలబెడుతుందో చూడాలిక.
ఇవి కూడా చదవండి..
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
రాష్ట్రంలో వింత వాతావరణం..
బెంగాల్.. సస్పెన్స్ థ్రిల్లర్!
18+కు టీకాలెలా?
మ్‌డెసివిర్ ప్లీజ్!
‘స్పుత్నిక్ వీ’లో వైరస్
ముంబైలో మూడు రోజులు వ్యాక్సినేషన్ బంద్
ఇజ్రాయిల్ మౌంట్ మెరెన్లో తొక్కిసలాట.. 44 మంది మృతి
తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

