Sandeep Reddy Vanga | ప్రభాస్ హాలీవుడ్ సినిమాని రీమేక్ చేద్దామన్నాడు : సందీప్‌రెడ్డి వంగా
Prabhas – Sandeep Reddy Vanga | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యానిమల్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’(Spirit) అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నారు.
Prabhas – Sandeep Reddy Vanga | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యానిమల్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్’(Spirit) అనే సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు టాలీవుడ్ మూవీ లవర్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ లైన్‌కు సంబంధించి రీసెంట్గా సందీప్‌రెడ్డి బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఒక నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ కథ అని ప్రకటించాడు. ఇక ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా సాలిడ్ అప్డేట్ను పంచుకున్నాడు దర్శకుడు.
రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సందీప్‌రెడ్డి ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీపై మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యానిమల్ (Animal) సినిమా కంటే ముందు ప్రభాస్ ఒక హాలీవుడ్ సినిమాని రీమేక్ చేద్దామని నన్ను సంప్రదించాడు. అప్పుడు ఈ ఆలోచన మీకు బాగా పని చేస్తుందని నేను సూచించాను. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ‘స్పిరిట్’ కథతో ప్రభాస్ ముందుకి వెళ్లాను. ఆ కథ ప్రభాస్‌కు బాగా నచ్చింది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ స్టోరీ పనులు 60% కంప్లీట్ అయ్యాయి. త్వరలోనే స్టోరీ కంప్లీట్ చేసి డిసెంబర్లో షూటింగ్ ప్రారంభించనున్నాం. ఈ సినిమా కంప్లీట్ అయిన అనంతరం రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్ పార్క్'(Animal Park) చేస్తా అంటూ సందీప్ చెప్పుకోచ్చాడు. ఇక ఈ పోలీస్ డ్రామాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనుండగా.. ఎనిమిది భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

