Beast | విజయ్ ‘బీస్ట్’ నుంచి బిగ్ అప్డేట్.. వైరల్ అవుతున్న ఫోటో
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ థలపతి పరిచయం అక్కర్లేని పేరు. 'తుపాకీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన 'బీస్ట్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను నమోదు చేశాయి.
Beast Trailer Date Announced | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ థలపతి పరిచయం అక్కర్లేని పేరు. ‘తుపాకీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఈ చిత్రంతో తెలుగులో కూడా మంచి మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు. ఈయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతుంటాయి. ఈయన గత చిత్రం ‘మాస్టర్’ తెలుగులో 14కోట్ల షేర్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యంలో ముంచింది. ప్రస్తుతం ఈయన నటించిన ‘బీస్ట్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘డాక్టర్’ ఫేం నెల్సన్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను నమోదు చేశాయి. తాజాగా చిత్ర బృందం ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది.
యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను ఉగాది సందర్భంగా ఏప్రిల్ 2న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ట్విట్టర్లో ‘మేము కూడా మీ లాగే ‘బీస్ట్’ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నాం’ అంటూ విజయ్, పూజాహెగ్డేలతో పాటు పలువురు నటులు గోడచాటునుంచి తొంగి చూస్తున్నట్లు ఉన్న ఫోటోను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. విజయ్‌కు జోడిగా పూజాహెగ్డే హీరోయిన్గా నటించింది. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిథి మారణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన ‘అరబిక్ కుత్తూ’ 24కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలే విడుదలైన ‘జాల్లీ ఓ జింఖానా’ పాట కూడా మూడున్నర కోట్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 13న ఐదు భాషల్లో విడుదలకానుంది.
Naangalum ungala madhiri #BeastTrailer ku waiting nanba⁰🤝@actorvijay @Nelsondilpkumar @anirudhofficial @hegdepooja @selvaraghavan @manojdft @Nirmalcuts @anbariv #BeastModeON #Beast #BeastTrailerOnApril2 pic.twitter.com/WpwyrLrUCL
— Sun Pictures (@sunpictures) March 31, 2022
Read Also:
Ghani | భారీ ధర పలికిన ‘గని’ నాన్-థియేట్రికల్ హక్కులు?
Ajith Kumar | మధురై విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో అజిత్ నెక్స్ట్ చిత్రం?
Kriti Shetty | భారీగా పారితోషికాన్ని పెంచేసిన కృతిశెట్టి.. సూర్యతో సినిమాకు అన్ని కోట్లు తీసుకుందా?
Surya ‘ET’ | ఓటీటీలోకి సూర్య ‘ఈటీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

