హృదయ కాలేయం సినిమాతో బర్నింగ్ స్టార్‌గా మారిన సంపూ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యాడు.కామెడీకి కాస్త ఎమోషన్, యాక్షన్, సెంటిమెంట్ అంశాలు జోడించి సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ”బజార్ రౌడి” అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా రెండు రోజుల ముందు అంటే ఆగస్ట్ 20న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.
‘రౌడీలకు రామాయణం చెప్తే రావణాసురుడిని ఫాలో అవుతారు కానీ రాముడ్ని కాదు’ అని సంపూ చెప్పిన డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా, మధ్యలో ‘నీకు బాంబే (ముంబయి)లో బ్యాక్‌గ్రౌండ్ ఉండొచ్చు. నాకు బాంబేనే బ్యాక్‌గ్రౌండ్’ అనే పవర్ ఫుల్ డైలాగ్ చెబుతాడు సంపూ. డైలాగ్స్‌తో పాటు యాక్షన్ కూడా అదరగొట్టాడు. కాలితో తన్నితే బైక్ లేచి నిలబడటం.. ఒక రౌడీని చక్రంలా తిప్పుతూ ఫైట్ చేయడం వంటివి సంపూ మార్క్‌ని తెలియజేస్తున్నాయి.
బజార్ రౌడీ చిత్రంలో సంపూ రెండు పాత్రలలో సందడి చేయనున్నారు. డి. వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేశ్వరి వద్ది హీరోయిన్ గా కనిపిస్తోంది. షియాజీ షిండే , పృథ్వీ , నాగినీడు ,షఫీ, జీవ ,సమీర్ , మణిచందన,నవీన ,పద్మావతి తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. రెగ్యులర్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించినట్టు తెలుస్తుండగా, ఈ చిత్రాన్ని బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో కెఎస్ క్రియేషన్స్ పతాకంపై సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.