Athiradi Title Teaser | మలయాళ ఇండస్ట్రీలో యువ సంచలనాలుగా పేరు తెచ్చుకున్న నటులు బేసిల్ జోసెఫ్, టొవినో థామస్, వినీత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘అతిరథి’ (Athiradi). ఈ సినిమాకు అరుణ్ అనిరుధన్ దర్శకత్వం వహిస్తుండగా.. బేసిల్ జోసెఫ్ ఎంటర్టైన్మెంట్స్, డాక్టర్ అనంత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై డాక్టర్ అనంత్, బేసిల్ జోసెఫ్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే.. ఒకడు అడవిలో మంట అయితే మరోకరు సుడిగాలి లాంటివాడు అంటూ వినీత్ శ్రీనివాసన్ ఎలివేషన్ ఇవ్వడం చూపించారు. అయితే కథను రివీల్ చేయకుండా యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చేయబోతున్నట్లు తెలిపింది.