Puneet Raj Kumar: పునీత్ నుదుటిపై ముద్దు పెట్టిన సీఎం బొమ్మై

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించారు. అక్టోబర్ 29 ఉదయం ఇంట్లో జిమ్ చేస్తుండగా ఆయనకు గుండె పోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వెంటి లేటర్‌పై చికిత్స పొందుతూ కన్నుమూశారు .
కొద్ది సేపటి క్రితం పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు (Puneet Rajkumar Last rites) ముగిశాయి. లక్షలాది మంది అశ్రునయనాలు.. కుటుంబ సభ్యుల రోదనల మధ్య.. అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్ (Sree Kanteerava Studios)లో ప్రభుత్వ అధికారిక లంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై (Basavraj Bommai), మాజీ సీఎంలు యడియూరప్పతో (Yediyurappa), సిద్దరామయ్య (Siddharamaiah) పాటు ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరై పునీత్‌కు కడసారి వీడ్కోలు పలికారు.
అంత్యక్రియలు నిర్వహించే ముందు బొమ్మై పునీత్ ను కడసారిగా చూసుకుని కన్నీటి నివాళి అర్పించారు. అంతేకాకుండా పునీత్ పార్థీవదేహాన్ని ముద్దాడి, ప్రేమగా తలను నిమిరారు. గుండెలపై రెండు చేతులను పెట్టి కొద్దిసేపు నిల్చుండిపోయారు. మరోసారి పునీతుడి తలను నిమిరారు. చెంపలను తడిమారు. చేతులు జోడించి పార్థివదేహానికి నమస్కరించారు. కన్నీరు పెట్టుకున్నారు. భార్య అశ్వినీ రేవంత్, కుమార్తెలు ధృతి రాజ్‌కుమార్, వందిత రాజ్‌కుమార్.. పార్థివదేహం వద్దే కొద్దిసేపు కూర్చున్నారు. కడసారి వీడ్కోలు పలికారు. పునీత్ అంటే బొమ్మైకి కూడా ఎంత అభిమానమో ఈ సన్నివేశం చూస్తుంటే తెలుస్తుంది. పునీత్ ఇక లేడనే విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇవి కూడా చదవండి..
పునీత్ రాజ్ కుమార్ పై 400 కోట్ల పెట్టుబడులు.. ఆ సినిమాల పరిస్థితి ఏంటి..?
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు కారణం అదేనా?
Puneeth rajkumar movies పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
రియల్ హీరో పునీత్ రాజ్ కుమార్.. ఆయన చేసి సేవల గురించి తెలుసా
గతేడాది చిరంజీవి సర్జా.. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్.. కన్నడ సినిమాకు చీకటి రోజులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

