Bank of Bhagyalakshmi Teaser | దీక్షిత్‌శెట్టి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’. తెలుగు, కన్నడ భాషల్లో క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ ఎమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బృందా ఆచార్య కథానాయికగా నటిస్తున్నది. హెచ్ కె ప్రకాష్ నిర్మాత. ఇటీవల ఈ సినిమాలోని ‘హర ఓం..’ అంటూ సాగే తొలి గీతాన్ని విడుదల చేశారు. జుదాన్ శ్యాండీ స్వరపరచిన ఈ పాటను మంగ్లీ ఆలపించారు. బతుకుపై ఆశను తెలియజేస్తూ ఆధ్యాత్మిక భావాలతో ఈ పాట సాగింది. ‘ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న కామెడీ థ్రిల్లర్ ఇది. కథలోని మలుపులు ఆకట్టుకుంటాయి అని చిత్రబృందం చెబుతుంది.
ఈ చిత్రానికి జుధాన్ శ్యాండీ సంగీతం అందిస్తున్నారు. అభిషేక్ జే డీవోపీగా పని చేస్తున్నారు. తేజస్ ఆర్ ఎడిటర్ గా పని చేస్తుండగా, రఘు మైసూర్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ఇక తాజాగా మూవీ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ ఆసక్తికరంగా సాగింది. దొంగతనం కోసం బ్యాంక్‌కి వెళితే అక్కడ కేవలం రూ. 67 వేలు మాత్రమే దొరకుతాయి. ఆ తర్వాత వారు విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటారు. అవన్నీ కూడా కామెడీతో పాటు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. టీజర్ చూస్తుంటే సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. మరి మీరు కూడా ఈ చిత్ర టీజర్ చూసి ఎంజాయ్ చేయండి. శ్రీదేవి ఎంటర్టైనర్స్ బ్యానర్ పై హెచ్ కె ప్రకాష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.