అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం బంగార్రాజు. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతుంది ఈ సినిమా. ఇందులో నాగ్ తనయుడు అక్కినేని నాగచైతన్య, ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కీలక పాత్రలలో నటిస్తున్నారు. నేడు నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా ‘బంగార్రాజు’ టీజర్ విడుదల చేశారు
తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో బంగార్రాజు పాత్రలో నాగచైతన్య కనిపిస్తుండగా.. నాగార్జున పాత్రను చైతన్య పోషిస్తున్నట్లుగా.. తెలుస్తోంది. షార్ట్ అండ్ స్వీట్గా ఉన్న టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. సంక్రాంతి రేసులో నిలపడమే లక్ష్యంగా చిత్రాన్ని శరవేగంగా ముస్తాబు చేస్తున్నారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ స్వరాలందిస్తున్నారు.