Bangarraju movie on OTT |అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బంగార్రాజు. కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2016లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయినా చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి14న విడుదలైన బంగార్రాజు చిత్రం మంచి రివ్యూలను సొంతం చేసుకుంది. మంచి కలెక్షన్లు సాధించింది. తాజాగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను కంప్లీట్ చేసుకుంది. 39కోట్లతో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫైనల్‌గా 39.61 కోట్ల షేర్‌ను సాధించింది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5 లో బంగార్రాజు చిత్రం ఈ నెల 18నుండి స్ట్రీమింగ్ కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ-స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున అక్కినేని ఈ చిత్రాన్ని నిర్మించాడు. రమ్యకృష్ణ, కృతి శెట్టిలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఈ చిత్రం నాగార్జున కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.