ఒకప్పుడు సినిమాలతో వార్తలలో నిలిచే బండ్ల గణేష్.. ఈ మధ్య సోషల్ మీడియా పోస్ట్‌లతో వార్తలలోకి ఎక్కుతున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌పై అమితమైన ప్రేమను కురిపిస్తూ పోస్ట్‌లు పెట్టడం, సోషల్ మీడియా ద్వారా సాయం కావాలని అడిగిన వారికి వెంటనే స్పందించడంతో బండ్ల గణేష్ పేరు మారు మ్రోగిపోతుంది.అయితే ట్విట్టర్ ద్వారా నిత్యం వార్తలలో నిలుస్తూ వస్తున్న బండ్ల త్వరలో ట్విట్టర్‌కి గుడ్ బై చెప్పేస్తానంటూ ట్వీట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు.
మెగా ఫ్యామిలీ హీరోలపై ఎంతో ప్రేమ కురిపించే బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ పేరు చెబితే పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. ఇటీవల పవన్ కొత్త సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్ అప్డేట్ ఇస్తూ ‘దేవర వేట మొదలయింది’ అంటూ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చిన గణేష్ ఆ తర్వాత ‘దేవర దెబ్బ బాబుల్ గాడి అబ్బా’ అంటూ పవన్ లుంగీ లుక్‌పై కామెంట్ చేశారు. ఈ కామెంట్‌పై పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు.
మహేష్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరోని ఉద్దేశించే ఇలాంటి కామెంట్ చేశాడని భావిస్తూ.. బండ్ల గణేష్‌ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే బండ్ల.. త్వరలో ట్విట్టర్‌కి గుడ్ బై చెప్పేస్తా అని, ”నో కాంట్రవర్సీస్.. నా లైఫ్‌లో అలాంటి వాటికి చోటు లేదు” అని ఆయన పేర్కొన్నట్టు తెలుస్తుంది.