ఓ తెలుగు టీవీ సీరియల్ చిత్రీకరణ సందర్భంగా సహాయ దర్శకుడు రంజిత్కుమార్పై దాడి చేసిన కన్నడ టీవీ నటుడు చందన్ కుమార్‌ను తెలుగు సీరియల్స్ నుంచి నిషేధిస్తున్నట్లు తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ వెల్లడించింది. ఇవాళ హైదరాబాద్‌లో పాత్రికేయులతో ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతూ…‘సహాయ దర్శకుడిపై దురుసుగా ప్రవర్తించి, దాడి చేసిన కన్నడ నటుడు చందన్ కుమార్‌ను బ్యాన్ చేస్తున్నాం. మా ఆత్మగౌరవం దెబ్బతీసేలా అతను ప్రవర్తించాడు. దాడి చేయడమే కాకుండా టీవీ పరిశ్రమకు చెడ్డ పేరు తెచ్చేలా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఇకపై తెలుగు సీరియల్స్‌లో అతన్ని తీసుకోము. మన టీవీ రంగంలో దాదాపు 240 మంది పరభాషా నటీనటులు నటిస్తున్నారు. వాళ్లెవరితో మాకు ఇబ్బంది లేదు’ అని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో ‘శ్రీమతి శ్రీనివాస్’ అనే ధారావాహిక చిత్రీకరణ సందర్భంగా ఈ గొడవ చోటుచేసుకుంది.