Veera Simha Reddy | థియేటర్లో బాలయ్య అభిమానుల రచ్చ.. యూఎస్‌లో షో నిలిపివేత..!
అభిమాన హీరో సినిమా వచ్చిందంటే థియేటర్లలో ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. ముఖ్యంగా మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమా వచ్చిందంటే ఇంకా ఫ్యాన్స్ రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఇన్నాళ్లు ఈ రచ్చ లోకల్లో మాత్రమే ఉండేది.
Veera Simha Reddy Movie | అభిమాన హీరో సినిమా వచ్చిందంటే థియేటర్లలో ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. ముఖ్యంగా మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమా వచ్చిందంటే ఇంకా ఫ్యాన్స్ రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఇన్నాళ్లు ఈ రచ్చ లోకల్లో మాత్రమే ఉండేది. ఇక ఇప్పుడు ఆ రచ్చ విదేశాలకు పాకింది. ఏంటి లోకల్ వాల్లే అభిమాన హీరో కోసం హంగామా చేస్తారా? విదేశాల్లో ఉండే మేము చేయలేమా అంటూ యూఎస్‌లో నందమూరి అభిమానులు విధ్వంసం సృష్టించారు. ఫ్యాన్స్ చేసిన రచ్చకు థియేటర్ యాజమాన్యం ఏకంగా షోనే నిలిపివేసింది.
వివరాల్లోకి వెళ్తే.. నటసింహం నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించిన సినిమా వీరసింహా రెడ్డి. క్రాక్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత గోపిచంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రిలీజ్‌కు ముందే విడుదలైన పోస్టర్లు, పాటలు, ట్రైలర్లు ప్రతీది అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే హాఫ్ మిలియన్ డాలర్ మార్కును టచ్ చేసి యూఎస్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా తాజాగా ఈ మూవీ రిలీజై పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. టాక్ సంగతి అటుంచితే బాలయ్య ఫ్యాన్స్ యూఎస్ థియేటర్ల వద్ద రచ్చ చేస్తున్నారు.
కాగా అమెరికాలోని ఓ థియేటర్లో బాలయ్య అభిమానులు చేసిన రచ్చ వివాదానికి దారి తీసింది. షో మొదలవ్వగానే ఫ్యాన్స్ థియేటర్ మొత్తం కాగితాలతో నింపేస్తూ.. నానా హంగామా చేశారు. అభిమానుల రచ్చ భరించలేక థియేటర్ యాజమాన్యం అర్ధాంతరంగా షోను ఆపేసింది. అంతటితో ఆగకుండా అభిమానులను థియేటర్లో నుంచి బయటకు పంపేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
గతంలో తాము ఎన్నో తెలుగు సినిమాలను ప్రదర్శించామని.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని యాజమాన్యం వెల్లడించింది. ఒక్క థియేటర్లోనే కాదు యూఎస్‌లోని అన్ని థియేటర్లలో బాలయ్య అభిమానులు ఇదే రచ్చ చేస్తున్నారట. కొన్ని థియేటర్లలో జై బాలయ్య నినాదాలు చేయొద్దని సూచించారు. దీనిపై పలువురు బాలయ్య అంటే మాములుగా ఉండదూ, ఆంధ్రా అయినా.. అమెరికా అయినా బాలయ్య సినిమా అంటే అట్లే ఉంటది అంటూ పలువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
It’s high time that telugu movie goers in overseas has to refrain from these activities. There is no issue in engaging and enjoying, but causing nuisance is unwarranted#VeeraSimhaReddyOnJan12th #VeeraSimhaReddy #TeluguCinema #VSR #BalakrishnaNandamuri #NBK #NandamuriBalakrishna pic.twitter.com/yHTiBRYaJq
— TeluguBulletin.com (@TeluguBulletin) January 12, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

