బాలయ్య డైలాగ్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే..!

అఖండ.. ఇప్పుడు బాలయ్య అభిమానులకు ఇది తారకమంత్రం అయిపోయింది. సినిమా ఎలా ఉండబోతుందనేది పక్కనబెడితే టీజర్ తోనే సంచలనాలు రేపుతున్నాడు బాలయ్య. ఈయన సినిమాలకు సాధారణంగా యూ ట్యూబ్ లో రికార్డులు రావు.. అంత దూరం కూడా వెళ్లవు. కానీ అఖండ మాత్రం ఏకంగా తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తున్నాడు. సీనియర్ హీరోల్లో ఈయన కంటే ముందు ఎవరూ లేరిప్పుడు. ఏకంగా రజినీకాంత్ రికార్డులను సైతం తిరగరాసి ఔరా అనిపించాడు అఖండ. ఇదిలా ఉంటే ఈ చిత్రం కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా వచ్చేలా కనిపిస్తుంది. అయితే ఏ మాత్రం బ్రేక్ దొరికినా కూడా కథను ఎప్పటికప్పుడు మార్చేస్తుంటాడు బోయపాటి శ్రీను. బెటర్ మెంట్ చేయడంలో ఈయనకు ఈయనే సాటి. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈ దర్శకుడు.
అఖండ సినిమా కథను కూడా మార్చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటికే చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఇందులో అఘోరగా నటిస్తున్నాడు బాలయ్య. ఇదే టీజర్ లోనూ కనిపించింది. బాలయ్య, బోయపాటి సినిమా అంటే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పదేళ్ల కింద బాలయ్య వరస ఫ్లాపుల్లో ఉన్నపుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ.. కేవలం నందమూరి అభిమానుల కోసమే బోయపాటి శ్రీను వచ్చాడు. సింహా సినిమాతో అప్పటికీ ఆరేళ్ల ఆకలిని తీర్చేశాడు. 2010 లో విడుదలైన ఈ సినిమా కథ బాలయ్య మీసం నుంచి పుట్టింది. ఆ తర్వాత మళ్లీ నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని లెజెండ్ అంటూ మరో బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చాడు. ఇందులో కూడా బాలయ్య బాబు లుక్ మరో స్థాయిలో ఉంటుంది. కేవలం ఆయన లుక్ ప్రజెంటేషన్ తోనే కథ సిద్ధం చేసుకుంటాడు బోయపాటి శ్రీను. ఇప్పుడు కూడా ఇదే చేశాడు.
బాలయ్యతో మరే దర్శకుడికి రాని ఐడియాలు, ఆలోచనలు బోయపాటి శ్రీనుకి వస్తాయి. తాజాగా అఖండ టీజర్ తోనే సంచలనాలు సృష్టిస్తున్నాడు బోయపాటి శ్రీను. ఈ టీజర్ చూసి యాక్షన్ సినిమా అనుకుంటున్నారేమో కానీ అందులో గుండెలను పిండేసే ఎమోషన్ కూడా ఉంటుందంటున్నాడు బోయపాటి శ్రీను. కచ్చితంగా మీరు ఏడుస్తారు.. ఏడిపించి పంపిస్తానంటున్నాడు ఈయన. సింహాలో కాస్త తక్కువ ఎమోషన్ ఉంటుంది కానీ లెజెండ్ లో మాత్రం బాగానే పిండేసాడు బోయపాటి శ్రీను. ముఖ్యంగా సెకండాఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అఖండలో మరో ఆసక్తికరమైన విషయం దాగుంది. ఇందులో బాలయ్య ఎక్కువగా సంస్కృతం మాట్లాడబోతున్నాడు. ముఖ్యంగా డైలాగులు కూడా అవే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. బాలయ్య చెప్పనున్న డైలాగ్స్ అభిమానులను అలరిస్తాయని నమ్మకంగా చెప్తున్నాడు బోయపాటి శ్రీను. త్వరలోనే సినిమా విడుదల తేదీపై క్లారిటీ రానుంది.
ఇవి కూడా చదవండి..
కెనడాలో వింత వ్యాధి
డెల్టా పెరిగింది.. కప్పా తగ్గింది!
ఢిల్లీ ఎయిమ్స్‌లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్
Krishnapatnam : నేటి నుంచి ఆనందయ్య మందు పంపిణీ
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
ఘోరం.. పాక్‌లో రెండు రైళ్ల ఢీ.. 30 మంది మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

